
Andy Murray : ఆండ్రీ ముర్రే అరుదైన ఘనత.. 200వ మ్యాచులో విజయం
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచ మాజీ నంబర్ వన్ ఆండ్రీ ముర్రే అరుదైన ఘనతను సాధించాడు. గురువారం న్యూయార్క్‌లో జరిగిన యూఎస్ ఓపెన్‌లో ఆ అరుదైన మైలురాయిని చేరుకున్నాడు.
ఫ్రెంచ్ ఆటగాడు కొరెంటిన్ మౌటెట్ ను వరుస సెట్లలో చిత్తు చేసి అండ్రీ ముర్రే రెండో రౌండ్‌కు అర్హత సాధించాడు.
దాదాపు మూడు గంటల పాటు ఉత్కంఠంగా సాగిన ఈ మ్యాచులో 6-2, 7-5, 6-3 తేడాతో ఆండ్రీ ముర్రే విజయం సాధించాడు.
ఫలితంగా గ్రాండ్ స్లామ్స్ ఆడిన తన 200వ మ్యాచులో విజయం సాధించిన ఆటగాడిగా రికార్డుకెక్కాడు. ఈ మ్యాచ్‌లో ముర్రే మొత్తం 112 పాయింట్లు సాధించాడు.
అండీ ముర్రే మొదటి, రెండవ సర్వ్‌లలో వరుసగా 77, 62 శాతాన్ని విజయాన్ని నమోదు చేశాడు.
Details
అండ్రీ ముర్రే సాధించిన రికార్డులే
గ్రాండ్‌స్లామ్‌లలో 200 లేదా అంతకంటే ఎక్కువ సింగిల్స్ మ్యాచ్‌లు ఆడిన తొమ్మిదవ ఆటగాడిగా ముర్రే చరిత్రకెక్కాడు.
రోజర్ ఫెదరర్ (369), నొవాక్ జొకోవిచ్ (354), రాఫెల్ నాదల్ (314), జిమ్మీ కానర్స్ (233), ఆండ్రీ అగస్సీ (224), ఇవాన్ లెండిల్ (222), రాయ్ ఎమర్సన్ (210), పీట్ సంప్రాస్ (210) తర్వాతి స్థానంలో అండీ ముర్రే నిలిచాడు.
ముఖ్యంగా యుఎస్ ఓపెన్‌లో ముర్రే తన 49వ విజయాన్ని నమోదు చేశాడు. 2012 యూఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ ఫైనల్‌లో ముర్రే 7-6(10), 7-5, 2-6, 3-6, 6-2 స్కోరుతో జకోవిచ్‌ను ఓడించిన విషయం తెలిసిందే.
ముర్రే తన కెరీర్‌లో 46 సింగిల్స్ టైటిల్స్ సాధించాడు. ముర్రే గతేడాది వింబుల్డన్‌ను గెలుచుకున్న విషయం తెలిసిందే.