
SRH: సన్ రైజర్స్ లోకి మరో విధ్వంసకర బ్యాటర్.. ఎవరీ స్మరన్ రవిచంద్రన్?
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ 2025 సీజన్‌లో వరుస పరాజయాలకు చెక్ పెట్టిన సన్ రైజర్స్ హైదరాబాద్ చివరికి విజయం సాధించింది.
తాజాగా పంజాబ్ కింగ్స్‌పై అద్భుతమైన గెలుపును నమోదు చేసి, జోష్‌లోకి వచ్చిన సన్‌రైజర్స్ జట్టు ఇప్పుడు విజయాలను సాధించాలని గట్టి పట్టుదలతో ఉంది.
అయితే ఈ క్రమంలో జట్టుకు తీవ్ర ఎదురుదెబ్బ తగిలింది. టీమ్‌లో కీలక స్థానాన్ని ఆక్రమించిన ఆడమ్ జంపా గాయం కారణంగా మిగిలిన మ్యాచ్‌లకు దూరం కానున్నాడు.
ఆడమ్ జంపా స్థానాన్ని భర్తీ చేసేందుకు సన్‌రైజర్స్ హైదరాబాద్ కర్ణాటక యువ ఆటగాడు స్మరన్ రవిచంద్రన్‌ను జట్టులోకి తీసుకుంది.
రూ.30 లక్షల బేస్ ప్రైస్‌తో ఐపీఎల్ వేలంలో పాల్గొన్న రవిచంద్రన్‌ను అప్పట్లో ఏ ఫ్రాంచైజీ కొనలేదు.
Details
స్మరన్ రవిచంద్రన్ ఎవరు?
అయితే ఇప్పుడు జంపా గాయంతో బయటపడటంతో, సన్‌రైజర్స్ అతడిని అదే బేస్ ప్రైస్‌కు తమ జట్టులోకి చేర్చుకుంది. కర్ణాటకకు చెందిన స్మరన్ రవిచంద్రన్ 21 ఏళ్ల యువ ఆటగాడు.
ఎడమచేతి వాటం బ్యాటర్‌గా దేశవాళీ క్రికెట్‌లో ఆకట్టుకునే ప్రదర్శన చేస్తూ వస్తున్నాడు. ఇప్పటి వరకు అతడు ఏడు ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడి, అద్భుత ఫామ్‌లో 64.50 సగటుతో 500 పైగా పరుగులు సాధించాడు.
ఇందులో ఓ డబుల్ సెంచరీ కూడా ఉంది. అలాగే 10 లిస్ట్-ఏ మ్యాచ్‌ల్లో అతడు 72.16 సగటుతో 433 పరుగులు నమోదు చేశాడు.
Details
జంపా స్థానంలో రవిచంద్రన్
ఇందులో రెండు శతకాలు ఉన్నాయి. టీ20ల్లోనూ అతడి ప్రభావం కనిపిస్తోంది.
ఆరు టీ20 మ్యాచ్‌ల్లో 170కి పైగా స్ట్రైక్ రేట్‌తో 170 పరుగులు చేశాడు.
ఇక సన్‌రైజర్స్ హైదరాబాదు తమ తదుపరి మ్యాచ్‌ను ఏప్రిల్ 17 (గురువారం) ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో ఆడనుంది.
జంపా లేని పరిస్థితుల్లో కొత్తగా చేరిన రవిచంద్రన్‌పై అంచనాలు పెరిగే అవకాశం ఉంది.