తదుపరి వార్తా కథనం

Asian Games 2023: ఆసియా క్రీడల్లో భారత్‌కి మరో గోల్డ్ మెడల్
వ్రాసిన వారు
Jayachandra Akuri
Sep 27, 2023
09:20 am
ఈ వార్తాకథనం ఏంటి
చైనాతో జరుగుతున్న ఆసియా గేమ్స్‌లో భారత్ సత్తా చాటుతోంది.
ఇప్పటికే 3 గోల్డ్ మెడల్స్ సాధించిన భారత్ తాజాగా మరో గోల్డ్ మెడల్‌ను సాధించింది.
మహిళల 25 మీటర్ల పిస్టల్ టీమ్ ఈవెంట్లో భారత్ బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది.
నాల్గవ రోజు 25 మీటర్ల పిస్టల్ టీమ్ ఈవెంట్‌లో ఈషా సింగ్, మను భాకర్, రిథమ్ సాంగ్వాన్ మొత్తం 1759 పాయింట్లు సాధించి భారత్‌కి గోల్డ్ సాధించారు.
Details
ఇప్పటికే నాలుగు గోల్డ్ మెడల్స్ సాధించిన భారత్
భారత షూటర్లు మనూ బాకర్, రిథమ్ సంగ్వాన్, ఇషా సింగ్ అద్భుత ప్రదర్శన తో భారత్ ఖాతాలో మరో పసిడి చేరింది.
తాజా గోల్డ్ మెడల్‌తో 19వ ఆసియా క్రీడల్లో భారత్ మొత్తం 16 పతకాలను సాధించింది.
ఇందులో నాలుగు గోల్డ్ మెడల్స్, ఐదు వెండి, ఏడు కాంస్యా పతకాలు ఉన్నాయి.