Loading...
Badminton: టర్కిష్ జూనియర్ బ్యాడ్మింటన్‌లో తెలుగు యువ ఆటగాడు సాయి నచికేత్‌కు మరో అంతర్జాతీయ టైటిల్
టర్కిష్ జూనియర్ బ్యాడ్మింటన్‌లో తెలుగు యువ ఆటగాడు సాయి నచికేత్‌కు మరో అంతర్జాతీయ టైటిల్

Badminton: టర్కిష్ జూనియర్ బ్యాడ్మింటన్‌లో తెలుగు యువ ఆటగాడు సాయి నచికేత్‌కు మరో అంతర్జాతీయ టైటిల్

వ్రాసిన వారు Moogati Shabari
Jul 27, 2026
11:04 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆల్ ఇంగ్లాండ్ జూనియర్ బ్యాడ్మింటన్ టోర్నీలో ఇటీవలే ఛాంపియన్‌గా నిలిచి అందరి దృష్టిని ఆకర్షించిన తెలుగు షట్లర్ సాయి నచికేత్ భట్రాజు మరోసారి తన ప్రతిభను చాటుకున్నాడు. టర్కిష్ జూనియర్ బ్యాడ్మింటన్ టోర్నీలో అద్భుత ప్రదర్శనతో విజేతగా నిలిచి మరో అంతర్జాతీయ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఫైనల్ పోరులో నచికేత్ 21-11, 23-11 స్కోర్లతో టోర్నీ టాప్ సీడ్ టర్కీకి చెందిన టెరిమిస్‌ను వరుస సెట్లలో ఓడించి ఛాంపియన్‌గా అవతరించాడు.

వివరాలు

కోచ్ చేతన్ ఆనంద్ ప్రశంసలు..

అంతకుముందు జరిగిన సెమీఫైనల్లో సౌదీ అరేబియాకు చెందిన అమీర్ మహ్మద్‌పై 21-13, 21-19తో గెలిచిన నచికేత్, క్వార్టర్ ఫైనల్లో ఇరాన్‌కు చెందిన అహ్మద్లూతో జరిగిన హోరాహోరీ పోరులో 21-18, 21-23, 21-9 స్కోర్లతో విజయం సాధించి ఫైనల్‌కు చేరుకున్నాడు.

ప్రస్తుతం హైదరాబాద్‌లోని చేతన్ ఆనంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో శిక్షణ పొందుతున్న సాయి నచికేత్ వరుసగా రెండు అంతర్జాతీయ జూనియర్ టోర్నీల్లో టైటిళ్లు సాధించడం విశేషమని అతని కోచ్ చేతన్ ఆనంద్ ప్రశంసించారు.

ఇదే జోష్‌ను కొనసాగిస్తే భవిష్యత్తులో మరెన్నో ప్రతిష్ఠాత్మక విజయాలు సాధించే సత్తా నచికేత్‌కు ఉందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

ADVERTISEMENT