Page Loader
క్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లిన అరీనా సబలెంకా
క్వార్టర్ ఫైనల్ కి అర్హత సాధించిన సబలెంకా

క్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లిన అరీనా సబలెంకా

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 05, 2023
02:56 pm

ఈ వార్తాకథనం ఏంటి

2023 ఫ్రెంచ్ ఓపెన్‌లో ప్రపంచ 2వ ర్యాంకర్ అరీనా సబలెంక శుభారంభం చేశారు. మహిళల సింగిల్స్ లో అరీనా సబలెంకా 7-6, 6-4తో స్లోన్ స్టీఫెన్స్‌ను చిత్తు చేసింది. దీంతో ఫ్రెంచ్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్‌కు అమె అర్హత సాధించింది. సబలెంకా 2023లో 33-5 గెలుపు-ఓటముల రికార్డుకు చేరుకుంది. సబలెంకా 2023లో తన మూడవ WTA టైటిల్‌ను కైవసం చేసుకోవడానికి 2023 మాడ్రిడ్ ఓపెన్‌ను గెలుచుకుంది. ఈ సంవత్సరం WTA టోర్నమెంట్‌లో ఆమెకు ఇది ఐదవ ఫైనల్ కావడం విశేషం. సబలెంకా ఇండియన్ వెల్స్, స్టట్‌గార్ట్ ఓపెన్‌లలో కూడా రన్నరప్‌గా నిలిచిన విషయం తెలిసిందే.

Details

డారియా కసత్కినా చిత్తు చేసిన ఎలినా స్విటోలినా

గ్రాండ్‌స్లామ్‌లలో సబలెంకా 47-19 గెలుపు-ఓటముల రికార్డును కలిగి ఉంది. ఫ్రెంచ్ ఓపెన్‌లో ఆమె స్కోరు 11-5గా ఉంది. హెడ్-టు-హెడ్ రికార్డు పరంగా సబలెంకా ఇప్పుడు స్టీఫెన్స్‌పై 4-0 రికార్డును సొంతం చేసుకుంది. ఫ్రెంచ్ ఓపెన్‌లో నాల్గవ రౌండ్ మ్యాచులో సబలెంకా 4/9 బ్రేక్ పాయింట్‌లను మార్చి, రెండు ఏస్‌లను సాధించింది. ఎలినా స్విటోలినా 6-4, 7-6తో డారియా కసత్కినాను ఓడించింది. స్విటోలినా మొదటి సర్వ్‌లో 61శాతం విజయం సాధించగా, రెండో సర్వ్‌లో 41శాతం విజయం సాధించింది. ఆమె 6/12 బ్రేక్ పాయింట్లను మార్చింది. దీంతో స్విటోలినా క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది.