Shakibal Hasan: ఢాకా కోర్టు నుంచి షకీబ్ అల్ హసన్‌కు అరెస్ట్ వారెంట్
ఈ వార్తాకథనం ఏంటి
బంగ్లాదేశ్ స్టార్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ ఇటీవల కాలంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొంటున్నారు.
సెప్టెంబర్ 2024లో ఇంగ్లండ్‌లో జరిగిన కౌంటీ మ్యాచ్‌లో ఆయన బౌలింగ్ యాక్షన్ చట్టవిరుద్ధంగా ఉన్నట్లు ఫిర్యాదు అందింది. ఈ ఫిర్యాదుతో షకీబ్‌పై నిషేధం విధించారు.
ఇప్పటికే బౌలింగ్ యాక్షన్ టెస్టుల్లో రెండు సార్లు విఫలమైన షకీబ్‌కి ఇది గట్టిదెబ్బగా మారింది.
ఈ కారణంగా బంగ్లాదేశ్ జట్టులో ఆయన ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక కాలేకపోయాడు.
ఈ ఘటనల మధ్య షకీబ్‌కి మరొక పెద్ద సమస్య ఎదురైంది. ఐఎఫ్‌ఐసి బ్యాంక్‌కు సంబంధించిన చెక్ బౌన్స్ కేసులో షకీబ్ మరో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది.
Details
రూ.3 కోట్లు చెల్లించాల్సి ఉంది
చెక్ బౌన్స్ కారణంగా షకీబ్‌పై ఢాకాలోని కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.
ఢాకా అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ జియాదుర్ రెహమాన్ ఆదివారం షకీబ్‌తో పాటు మరో ముగ్గురిపై అరెస్ట్ వారెంట్ జారీ చేశారు.
ఈ కేసును ఐఎఫ్‌ఐసి బ్యాంక్ రిలేషన్‌షిప్ ఆఫీసర్ షాహిబుర్ రెహమాన్ దాఖలు చేయగా, 41.4 మిలియన్ టాకా (భారత కరెన్సీలో సుమారు 3 కోట్లు) చెల్లించాల్సి ఉండగా, షకీబ్ చెల్లించడంలో విఫలమయ్యారు.
ఈ కేసులో షకీబ్ సంస్థ 'అల్ హసన్ ఆగ్రో ఫామ్ లిమిటెడ్' ప్రధాన పాత్ర పోషించగా, ఈ కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్ ఘాజీ షాగీర్ హుస్సేన్, డైరెక్టర్లు ఇమ్దాదుల్ హక్, మలైకర్ బేగం పేర్లు కూడా చేర్చారు.
Details
అమెరికాలో స్థిరపడ్డ షకీబ్
ప్రస్తుతం విదేశాల్లో ఉన్న షకీబ్ బంగ్లాదేశ్‌కు తిరిగి రావడానికి నిరాకరించారు.
దేశంలో కొనసాగుతున్న రాజకీయ అశాంతి, భద్రతాపరమైన సమస్యలు, చట్టపరమైన చిక్కులు కారణంగా ఆయన తిరిగి రాకుండా ఉన్నట్లు తెలుస్తోంది.
ఆయన కుటుంబం ప్రస్తుతం అమెరికాలో స్థిరపడగా, షకీబ్ బంగ్లాదేశ్‌కు తిరిగి వచ్చే అవకాశం తక్కువగానే ఉందని భావిస్తున్నారు.