
Arshdeep Singh: ఐపీఎల్‌లో అరుదైన రికార్డు సృష్టించిన అర్ష్‌దీప్ సింగ్
ఈ వార్తాకథనం ఏంటి
భారత యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ ఐపీఎల్‌లో గొప్ప రికార్డును తన పేరిట లిఖించాడు.
పంజాబ్ కింగ్స్ తరఫున ఇప్పటివరకు అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా చరిత్రలో నిలిచాడు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ఓపెనర్ ఫిలిప్ సాల్ట్‌ను అవుట్ చేయడం ద్వారా అతడు తన ఖాతాలో 85వ వికెట్‌ను వేసుకున్నాడు.
ఈ విజయంతో అతడు పంజాబ్ తరఫున ఇప్పటివరకు అత్యధిక వికెట్లు తీసిన పీయూష్ చావ్లా రికార్డును అధిగమించాడు.
వివరాలు
అర్ష్‌దీప్ తొలిస్థానంలోకి..
పీయూష్ చావ్లా, సీనియర్ లెగ్ స్పిన్నర్,2008 నుంచి 2013 వరకు పంజాబ్ తరఫున ఆడాడు.
ఆకాలంలో అతడు 87 మ్యాచ్‌లలో 84 వికెట్లు పడగొట్టాడు. అతడి ఎకానమీ రేట్ 7.52గా ఉంది.
కానీ,అర్ష్‌దీప్ మాత్రం కేవలం 72మ్యాచ్‌ల్లోనే 85వికెట్లు తీయడం ద్వారా వేగంగా ఈ ఘనత సాధించాడు.
దీంతో పంజాబ్ కింగ్స్ జట్టులో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్ల జాబితాలో అర్ష్‌దీప్ తొలిస్థానంలోకి ఎగబాకాడు, ఇక చావ్లా రెండో స్థానానికి దిగజారాడు.
ఇక మూడవ స్థానంలో 73 వికెట్లతో సీనియర్ పేసర్ సందీప్ శర్మ ఉన్నాడు.
అతని తర్వాతి స్థానాల్లో వరుసగా 61 వికెట్లు తీసిన అక్షర్ పటేల్ నాలుగో స్థానంలో ఉండగా,58 వికెట్లు పడగొట్టిన మహ్మద్ షమీ ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు.
వివరాలు
ప్రధాన పేసర్‌గా
అర్ష్‌దీప్ 2019 నుంచి పంజాబ్ కింగ్స్ తరఫున ఆడుతున్నాడు. లెఫ్ట్ ఆర్మ్ పేసర్‌గా తన ప్రత్యేకత చూపిస్తూ, మంచి లైన్ అండ్ లెంగ్త్‌తో వికెట్లు సాధించడంలో అతడు ప్రతిభను చాటాడు.
ప్రస్తుతం పంజాబ్ బౌలింగ్ విభాగంలో అతడు ప్రధాన పేసర్‌గా రాణిస్తున్నాడు.
పవర్ ప్లేలోనూ, డెత్ ఓవర్లలోనూ స్పెషలిస్ట్‌గా అద్భుతంగా బౌలింగ్ చేయగలిగే ఈ యువ పేసర్, పంజాబ్ జట్టు బౌలింగ్ యూనిట్‌కు వెన్నెముకలా మారాడు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఐపీఎల్‌లో అరుదైన రికార్డు సృష్టించిన అర్ష్‌దీప్ సింగ్
ARSHDEEP SINGH COMING CLUTCH FOR PBKS. 👏pic.twitter.com/k4xMaOS0NC
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 18, 2025