IND vs IRE:రెండో టీ20లో ఐర్లాండ్ చిత్తు.. 33 పరుగుల తేడాతో నెగ్గిన భారత్
ఈ వార్తాకథనం ఏంటి
ఐర్లాండ్‌తో జరిగిన రెండో టీ20లో టీమిండియా 33 రన్స్ తేడాతో విజయం సాధించింది.
186 రన్స్ టార్గెట్‌తో బ్యాటింగ్‌కు దిగిన ఐర్లాండ్ 20 ఓవర్లలో 152/8 రన్స్‌కే పరిమితమైంది.
ఐర్లాండ్ ఓపెనర్ బల్‌బీర్న్ 72 రన్స్‌తో ఒంటరి పోరాటం చేసినా ఫలితం లేకపోయింది.
భారత బౌలర్లలో బుమ్రా, ప్రసిద్, బిష్ణోయ్ తలో 2 వికెట్లు తీశారు. ఈ విజయంతో 3 టీ20ల సిరీస్‌ను భారత్ 2-0తో కైవసం చేసుకుంది.
మూడో టీ20 ఈనెల 23న జరగనుంది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ జట్టుకు ఆశించిన ఆరంభం దక్కలేదు. యశస్వి జైస్వాల్(18),తిలక్ వర్మ(1)ను షార్ట్‌పిచ్ బంతులతో వరుస ఓవర్లలో ఐర్లాండ్ పెవిలియన్ కు చేర్చింది.
Details
సత్తా చాటిన శాంసన్
పవర్‌ప్లే లో భారత్ స్కోర్ భారత్ 47/2 . విండీస్‌తో సిరీస్‌లో విఫలమైన శాంసన్ ఈ మ్యాచ్‌లో సత్తాచాటాడు.
తొలి 13 బంతుల్లో 14 పరుగులు చేసిన అతను.. కుదురుకున్నాక చెలరేగాడు. తనదైన పవర్ హిట్టింగ్‌తో లిటిల్ ఓవర్లో హ్యాట్రిక్ ఫోర్లతో పాటు ఓ సిక్సర్ బాదేశాడు. మరో బ్యాట్సమెన్ రుతురాజ్ అతనికి సహకరించాడు. దీంతో 7 నుంచి 12 మధ్య 6 ఓవర్లలో 57 పరుగులు వచ్చాయి.
12 ఓవర్లకు 104/2తో ఉన్న భారత్ భారీ స్కోర్ చేస్తుందనగా ఈ ఇద్దరు కొద్దీ రన్స్ వ్యవధిలో అవుట్ అవడంతో స్కోర్ నెమ్మదించింది.
ఐర్లాండ్ 16, 17, 18వ ఓవర్లలో ఒక్క బౌండరీ కూడా ఇవ్వలేదు.
Details
ఐర్లాండ్ బ్యాటింగ్‌లో బాల్‌బిర్నీ పోరాటం
ఈ మూడు ఓవర్లలో కలిపి కేవలం 14 పరుగులే వచ్చాయి. అయితే చివరి రెండు ఓవర్లలో వీళ్లిద్దరూ చెలరేగడంతో భారత్ మెరుగైన స్కోరు సాధించింది.
ఐర్లాండ్ ఇన్నింగ్స్ లో ఓపెనర్ ఆండ్రూ బాల్ బిర్నీ చేసిన 72 పరుగులకే అత్యధికం. కెప్టెన్ పాల్ స్టిర్లింగ్ (0),లోర్కాన్ టకర్ (0) డకౌట్ కాగా, కీలక ఆటగాడు హ్యారీ టెక్టర్ (7) నిరాశపరిచాడు.
కర్టిస్ కాంఫర్ 18, జార్జ్ డాక్రెల్ 13, మార్క్ అడౌర్ 23 పరుగులు చేయడంతో ఐర్లాండ్ స్కోరు 150 మార్కు చేరుకుంది.
టీమిండియా బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీయడంతో 3 మ్యాచ్ ల టీ20 సిరీస్ ను 2-0తో కైవసం చేసుకుంది. మూడో టీ20 మ్యాచ్ ఆగస్టు 23న జరగనుంది.