Page Loader
Ravichandra Ashwin: పలు రికార్డులను బద్దలు కొట్టిన అశ్విన్
పలు రికార్డులను బద్దలు కొట్టిన అశ్విన్

Ravichandra Ashwin: పలు రికార్డులను బద్దలు కొట్టిన అశ్విన్

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 22, 2024
12:38 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారతీయ స్టార్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. 522 వికెట్లతో టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక వికెట్ల జాబితాలో 8వ స్థానంలో ఉన్న కోట్నీ వాల్ష్‌ను వెనక్కి నెట్టాడు. కోట్నీ వాల్స్ 519 వికెట్లతో 9వ స్థానానికి పరిమితం అయ్యాడు. ఇక అశ్విన్ తొమ్మిది వికెట్లు తీస్తే నాథన్ లయన్‌ను దాటేస్తాడు. ఈ జాబితాలో మురళీధరన్‌ (800), వార్న్‌ (708), అండర్సన్‌ (704), కుంబ్లే (619), స్టువర్ట్‌ బ్రాడ్‌ (604), మెక్‌గ్రాత్‌ (563), నాథన్‌ లయన్‌ (530) మాత్రమే అశ్విన్‌ కంటే ముందు ఉన్నారు.

Details

టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించిన అశ్విన్

అదే విధంగా ప్రపంచ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌లో 5 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. అశ్విన్ 11 సార్లు ఈ ఫీట్‌ను సాధించాడు. అతని తర్వాత నాథన్‌ లయన్‌ (10), ప్యాట్‌ కమిన్స్‌ (8), బుమ్రా (7), హజిల్‌వుడ్‌ (6), సౌథీ (6) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఇక బంగ్లాదేశ్‌లో జరిగిన తొలి టెస్టులో అశ్విన్ ఆరు వికెట్లు తీసి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు.