
Asia Cup 2023: ప్రారంభమైన భారత్-పాక్ మ్యాచ్
ఈ వార్తాకథనం ఏంటి
ఆసియా కప్ లో భాగంగా భారత్- పాక్ మ్యాచ్ కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. కాసేపటి క్రితం పిచ్ ను పరిశీలించిన అంపైర్లు 4.40 నిమిషాలకు మ్యాచ్ ను మొదలు పెట్టారు.
ఇవాళ మధ్యాహ్నం 3 గంటల నుంచి వర్షం పడుతుండటంతో మ్యాచ్ ప్రారంభం కాలేదు. పిచ్ పరిశీలన అనంతరం 50 ఓవర్ల పూర్తి మ్యాచ్ జరుగుతుందని అంపైర్లు అనౌన్స్ చేశారు.
టీమిండియా జట్టు 24.1 ఓవర్ నుంచి తమ ఇన్నింగ్స్ ను షూరు చేయనుంది. ఈరోజు కూడా వర్షం పడుతుండటంతో మ్యాచ్ జరగదని తొలుత భావించారు.
అయితే వరుణుడు శాంతించడంతో ఎట్టకేలకు మ్యాచ్ ప్రారంభమైంది.
Details
హాఫ్ సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్
ఆదివారం మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు 24.1 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది.
భారత ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ అదిరిపోయే ఆరంభాన్ని అందించారు.
రోహిత్ శర్మ 56, గిల్ 58 పరుగులు చేసి పెవిలియానికి చేరారు. ప్రస్తుతం క్రీజులో కేఎల్ రాహుల్ (43), విరాట్ కోహ్లీ (26) ఉన్నారు.