Page Loader
ఆసియా కప్ విజయం చిరస్మరణీయం, క్రెడిట్ అంతా సిరాజ్‌దే: రోహిత్ కితాబు
క్రెడిట్ అంతా సిరాజ్‌దేనని కితాబు

ఆసియా కప్ విజయం చిరస్మరణీయం, క్రెడిట్ అంతా సిరాజ్‌దే: రోహిత్ కితాబు

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Sep 18, 2023
12:46 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆసియా కప్ 2023 ఫైనల్లో విజయం చిరస్మరణీయమని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నారు. గెలుపు క్రెడిట్ మొత్తం సిరాజ్‌దేనని ఆకాశానికెత్తారు. గాలిలోనే బంతి దిశ మార్చే పేసర్లు అరుదని, అలాంటి సామర్థ్యం సిరాజ్‌ సొంతమన్నారు. ఇదో గొప్ప ప్రదర్శనని, ఫైనల్లో ఈ తరహా ఆట టీమ్ మానసిక బలానికి నిదర్శమని రోహిత్ కీర్తించారు. బంతితో అద్భుతమైన ఆరంభం దొరికాక, అటు బ్యాట్‌తోనూ మంచి ముగింపునిచ్చామన్నారు. వికెట్లు పడుతుంటే నేను స్లిప్‌లో నిలబడి చూస్తుండిపోయాయన్నారు. తమ పేసర్లు చాలా కష్టపడ్డారన్నారు. జట్టు ప్రణాళికలను అమలు చేస్తూ చాలా స్పష్టమైన బౌలింగ్ చేశారన్నారు. బౌలర్లు ఈ స్థాయిలో విజృంభిస్తారని తాను ఊహించలేదని, అందరూ బాగా రాణించారన్నారు. ఈ విజయంలో క్రెడిట్ అంతా మొహ్మద్ సిరాజ్‌దేనన్నారు.

details

ప్రపంచ కప్‌లోనూ సత్తా చాటుతాం : రోహిత్

టీమిండియా జట్టుగా చేయాల్సినవన్నీ చేశామని, ఆస్ట్రేలియాతో సిరీస్ సహా ప్రపంచకప్‌-2023 కోసం ఎదురుచూస్తున్నట్లు రోహిత్ చెప్పారు. హార్దిక్ పాండ్యా, కిషన్ తీవ్ర ఒత్తిడిలోనూ పాక్ పై అద్భుతంగా ఆడారని, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ సెంచరీలు బాదారన్నారు. శుభ్‌మన్ గిల్ సైతం బాగా ఆడారన్నారు. కుర్రాళ్లు సైతం తమ బాధ్యతను చక్కగా నిర్వర్తిస్తున్నట్లు పేర్కొన్నారు. సిరాజ్ 6వికెట్లను పడగొట్టి 6/21తో అద్భుతమైన గణంకాలను నమోదు చేశారు. ఒకే ఓవర్లో నలుగుర్ని ఔట్ చేయడం ద్వారా 4 వికెట్ల తీశాడు. దీంతో లంక 50 పరుగులకే కుప్పకూలిపోయింది. ఆసియా కప్ 2023లో భాగంగా ఆదివారం కొలొంబోలో శ్రీలంకతో జరిగిన ఫైనల్లో టీమిండియా 10 వికెట్ల తేడాతో గెలుపొందింది.