Rohit Sharma:రోహిత్ శర్మ అరుదైన రికార్డు.. తొమ్మిది ఆటగాడిగా గుర్తింపు!
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన ఘనతను సాధించాడు. ఆసియా కప్ ఫైనల్ మ్యాచులో భాగంగా శ్రీలంకతో ఆడిన మ్యాచులో ఓ అరుదైన రికార్డును నెలకొల్పాడు. ఇప్పటివరకూ 250 వన్డే మ్యాచులు ఆడిన ఆటగాడిగా రికార్డుకెక్కాడు. ఈ జాబితాలో టీమిండియా తరుఫున తొమ్మిది స్థానంలో నిలిచాడు. అత్యుత్తమ బ్యాటర్లలో ఒకరైన హిట్ మ్యాన్ పదేశ్ల పాటు వన్డే క్రికెట్‌లో కొనసాగుతున్నాడు. 2007లో రోహిత్ భారత తరుఫున అరంగేట్రం చేసాడు. మొదట్లో మిడిలార్డర్ లో బ్యాటింగ్ చేసిన రోహిత్ అంతగా రాణించలేదు. 2013లో ఓపెనర్ గా ప్రమోట్ అయి అప్పటి నుంచి హిట్ మ్యాన్ రికార్డుల మీద రికార్డులను సృష్టించాడు.
హిట్ మ్యాన్ సాధించిన రికార్డులివే!
సచిన్ టెండూల్కర్ (463), ఎంఎస్ ధోని (347), రాహుల్ ద్రవిడ్ (340), మహ్మద్ అజారుద్దీన్ (334), సౌరవ్ గంగూలీ (308), యువరాజ్ సింగ్ (301), విరాట్ కోహ్లీ (280) అనిల్ కుంబ్లే(269) తర్వాతి స్థానంలో రోహిత్ నిలిచాడు. రోహిత్ ఇటీవల ఆసియా కప్‌లో 10000 పరుగుల మైలురాయిని దాటి ఆరో భారతీయ బ్యాటర్ గా నిలిచాడు. టెండూల్కర్ (18,426), కోహ్లి (13,027), గంగూలీ (11,363), ద్రావిడ్ (10,889), ధోనీ (10,773) తర్వాత అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా చరిత్రకెక్కాడు. వన్డే క్రికెట్‌లో వేగంగా10,000 పరుగులు చేసిన రెండో ఆటగాడిగా కూడా రోహిత్ నిలిచాడు. 241వ ఇన్నింగ్స్‌లో రోహిత్ ఈ ఘనత సాధించగా, కింగ్ కోహ్లీ 205 ఇన్నింగ్స్ లో ఆ మార్కును చేరుకున్నాడు.