Page Loader
ఆసియా కప్-2023 'ఛాంపియన్'గా అవతరించిన టీమిండియా.. 8వసారి టైటిల్ గెలిచిన భారత్
8వసారి టైటిల్ గెలిచిన భారత్

ఆసియా కప్-2023 'ఛాంపియన్'గా అవతరించిన టీమిండియా.. 8వసారి టైటిల్ గెలిచిన భారత్

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Sep 17, 2023
06:40 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆసియా కప్-2023లో టీమిండియా దుమ్మురేపింది. ఈ మేరకు శ్రీలంకపై కనీవినీ ఎరుగని రీతిలో అద్భుతమైన విజయం సాధించింది. మొత్తంగా 8వసారి ఆసియా విజేతగా ఆవిర్భవించింది.50 ఓవర్ల వన్డేలో ప్రత్యర్థి జట్టును కేవలం 50 పరుగులకే రోహిత్ సేన కట్టిడి చేసింది. దీంతో భారత్‌పై ఏ జట్టుకైనా ఇదే అత్యల్ప స్కోరుగా శ్రీలంక చెత్త రికార్డును మూటగట్టుకుంది. శ్రీలంక నిర్దేశించిన 51 పరుగుల లక్ష్యాన్ని కేవలం 6.1 ఓవర్లోనే వికెట్ నష్టపోకుండా టీమిండియా బ్యాటర్లు దంచికొట్టారు. శుభ్‌మన్ గిల్ 27, ఇషాన్ కిషన్‌ 23 పరుగులతో అజేయంగా నిలిచారు. 10 రన్ రేట్‌తో భారత ఓపెనర్లు దూకుడు ప్రదర్శించారు. కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో ఫైనల్ గెలిచిన భారత్, ఆసియా ఛాంపియన్ గా అవతరించింది.

details

శ్రీలంక టాప్ ఆర్డర్ ను కూల్చిన టీమిండియా స్టార్ పేసర్ సిరాజ్

తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆతిథ్య జట్టును టీమిండియా స్టార్ పేసర్ సిరాజ్ కుప్పకూల్చాడు. ఏకంగా ఒ‍కే ఓవర్లో నాలుగు వికెట్లు పడగొట్టిన హైదరాబాదీ ఫేసర్, శ్రీలంక పతనాన్ని శాసించాడు. 12వ ఓవర్‌ ముగిసే సరికి ఆరు వికెట్లు తీసి సంచలన ప్రదర్శన చేశాడు. జస్‌ప్రీత్‌ బుమ్రా తొలి వికెట్‌ తీసి లంకను దెబ్బకొట్టగా, సిరాజ్‌ దెబ్బకు లంక బ్యాటర్లు కుదేలయ్యారు. వన్డేల్లో అత్యల్ప స్కోరుకు(12 పరుగులకే) ఆరు వికెట్లు కోల్పోయిన జట్టుగా తన రికార్డును తానే రాసుకుంది. టెస్టు ఆడే జట్లలో రెండుసార్లు శ్రీలంక ఘోర పరాభవం మూటగట్టుకుంది. బుమ్రా ఒకటి, సిరాజ్‌ ఆరు, హార్దిక్‌ పాండ్యా మూడు వికెట్లను పడగొట్టి టీమిండియాకు విజయాన్ని కట్టబెట్టారు.