IND vs SL : భారత్-శ్రీలంక మధ్య రేపే బిగ్ ఫైట్.. గెలుపు ఎవరిది!
ఆసియా కప్ 2023 చివరి దశకు చేరుకుంది. రేపు జరిగే ఫైనల్ మ్యాచులో టైటిల్ కోసం భారత్, శ్రీలంక జట్లు పోటీపడనున్నాయి. ఇరు జట్లను పరిశీలిస్తే శ్రీలంక కంటే భారత్ మెరుగ్గా ఉంది. ఇటీవల శ్రీలంకతో జరిగిన మ్యాచులో భారత టాప్ ఆర్డర్ బ్యాటర్లు చేతులెత్తేయ్యడం కొంచెం ఆందోళనకు గురి చేస్తోంది. ఇరు జట్లలోని కీలక ప్లేయర్ల గురించి తెలుసుకుందాం. పాతుమ్ నిస్సాంక vs బుమ్రా పాతుమ్ నిస్సాంక శ్రీలంక తరుపున నిలకడగా పరుగులను రాబట్టుతున్నాడు. అయితే టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా బౌలింగ్ లో కొంచెం ఒత్తిడికి గురవుతున్నాడు. గత మ్యాచులో నిస్సాంకను 6పరుగులకే బుమ్రా పెవిలియానికి పంపాడు. ఇప్పటివరకూ బుమ్రా పవర్ ప్లేలో 37 వికెట్లను పడగొట్టాడు.
ఆసియా కప్ లో అద్భుతంగా రాణిస్తున్న దునిత్ వెల్లాలగే
చరిత్ అసలంక vs కుల్దీప్ యాదవ్ గత మ్యాచులో శ్రీలంకపై కుల్దీప్ యాదవ్ నాలుగు కీలక వికెట్లను పడగొట్టాడు. చరిత్ అసలంకను కుల్దీప్ వన్డేల్లో రెండుసార్లు ఔట్ చేశాడు. గత పాకిస్థాన్ జరిగిన మ్యాచులో అసలంక 49 పరుగులతో కీలక ప్రాత పోషించాడు. కుశాల్ మెండిస్ vs రవీంద్ర జడేజా ఈ టోర్నీలో మెండిస్ మూడు హాఫ్ సెంచరీలను బాదాడు. ఇప్పటివరకూ 40 వన్డేల్లో 9సార్లు ఎడమచేతి స్పిన్నర్ల చేతిలో ఔట్ అయ్యాడు. మిడిలార్డర్‌లో జడేజా, మెండిస్‌ను ఇబ్బంది పెట్టొచ్చు. విరాట్ కోహ్లీ vs దునిత్ వెల్లాలగే దునిత్ వెల్లలాగే ఆసియా కప్‌లో తన బౌలింగ్‌తో సంచనాలను సృష్టిస్తున్నాడు. గత మ్యాచులో విరాట్ కోహ్లీని మూడు పరుగులకే దునిత్ ఔట్ చేశాడు.