
Asia Cup final : నేడే శ్రీలంకతో మ్యాచ్.. భారత ఆటగాళ్లు చేసిన అత్యత్తుమ ప్రదర్శనలు ఇవే!
ఈ వార్తాకథనం ఏంటి
ఆసియా కప్ 2023 ఫైనల్ మ్యాచుకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. మరికాసేపట్లో టీమిండియా, శ్రీలంక జట్ల మధ్య తుదిపోరు జరగనుంది.
కొలంలోలోని ప్రేమదాస స్టేడియంలో ఈ ఫైనల్ మ్యాచుకు వేదిక కానుంది. ఈ అసియా కప్‌లో ఇరు జట్లు 22 మ్యాచుల్లో తలపడగా చెరో 11 మ్యాచుల్లో విజయం సాధించాయి.
ఆసియా కప్ 2023లో భారత్ ఆటగాళ్లు చేసిన ప్రదర్శన గురించి తెలుసుకుందాం.
రోహిత్ శర్మ
ఈ ఆసియా కప్ టోర్నీలో రోహిత్ శర్మ మూడు అర్ధ సెంచరీలు సాధించాడు.
క్రీజులో హిట్ మ్యాన్ ఎక్కువ సమయం గడిపితే ప్రత్యర్థి జట్టుకు కష్టాలు తప్పవు. ఇక కెప్టెన్‌గా జట్టులో కొన్ని మార్పులు చేసే అవకాశం ఉంది.
Details
వీరు రాణిస్తే మ్యాచ్ గెలిచినట్టే
శుభ్‌మన్ గిల్
ఐదు మ్యాచ్‌లలో 68.75 సగటుతో 275 పరుగులతో చేసి టోర్నమెంట్‌లో అత్యధిక స్కోరు సాధించిన భారత ఆటగాడిగా నిలిచాడు.
చివరి సూపర్ 4 మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై 121 పరుగులు చేసిన విషయం తెలిసిందే.
విరాట్ కోహ్లీ
ఈ టోర్నీలో విరాట్ కోహ్లీ అద్భుతంగా రాణిస్తున్నాడు. ముఖ్యంగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచులో 112 స్కోరు చేసి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.
ఈ టోర్నీలో రెండు ఇన్నింగ్స్‌లలో అతను సింగిల్ డిజిట్ పెవిలియానికి చేరడం గమనార్హం.
కేఎల్ రాహుల్
ఆసియా కప్ 2023లో ఇప్పటివరకు భారత్ తరుఫున కీలక సమయంలో పరుగులు రాబట్టాడు. సూపర్ 4 దశలో పాకిస్థాన్‌పై సెంచరీ చేసి సత్తా చాటాడు.
Details
అద్భుత ఫామ్ లో కుల్దీప్ యాదవ్
హార్దిక్ పాండ్యా
ఈ టోర్నీలో తాను బ్యాటింగ్ చేసిన రెండు ఇన్నింగ్స్‌లలో 92 పరుగులు చేశాడు. మొత్తంగా మూడు వికెట్లు కూడా పడగొట్టాడు. చివరిలో హార్ధిక్ పాండ్యా బ్యాట్ ఝుళిపించాల్సి ఉంది.
రవీంద్ర జడేజా
రవీంద్ర జడేజా ఆలౌ రౌండర్ ప్రదర్శనతో ఫర్వాలేదనిపించాడు. ఈ టోర్నిలో 6 వికెట్లు పడగొట్టాడు. అయితే బ్యాటింగ్‌లో జడేజా రాణించాల్సి ఉంది.
కుల్దీప్ యాదవ్
ఎడమచేతి వాటం మణికట్టు స్పిన్నర్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. భారత్ తరఫున గత రెండు మ్యాచ్‌ల్లో కుల్దీప్ 9 వికెట్లు తీశాడు.
Details
పవర్ ప్లేలో వికెట్లు తీస్తున్న జస్ప్రిత్ బుమ్రా
శార్దూల్ ఠాకూర్
ఈ ఆల్ రౌండర్ బ్యాటింగ్‌లో పెద్దగా రాణించడం లేదు. బౌలింగ్ విభాగంలో గత మూడు మ్యాచులో మొత్తం 5 వికెట్లను తీశాడు.
జస్ప్రిత్ బుమ్రా
భారత చివరి సూపర్ 4 మ్యాచ్‌లో విశ్రాంతి తీసుకున్న స్టార్ పేసర్ తిరిగి ఫైనల్ మ్యాచుకు తిరిగి జట్టులోకి వస్తాడు.
బుమ్రా పవర్ ప్లేలో వికెట్లు తీస్తూ కీలకంగా వ్యవహరిస్తున్నాడు.
మహ్మద్ సిరాజ్
ఈ రైట్ ఆర్మ్ పేసర్ తన అటాక్‌లో ప్రత్యర్థులకు వణుకు పుట్టిస్తున్నాడు. కీలక సమయంలో వికెట్లు తీస్తూ టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు.