NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / Asia Cup: ఈనెల 30 నుంచి ఆసియా కప్.. ఓటములలో పాకిస్థానే అగ్రస్థానం!
    తదుపరి వార్తా కథనం
    Asia Cup: ఈనెల 30 నుంచి ఆసియా కప్.. ఓటములలో పాకిస్థానే అగ్రస్థానం!
    ఈనెల 30 నుంచి ఆసియా కప్.. ఓటములలో పాకిస్థానే అగ్రస్థానం!

    Asia Cup: ఈనెల 30 నుంచి ఆసియా కప్.. ఓటములలో పాకిస్థానే అగ్రస్థానం!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Aug 16, 2023
    03:15 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆసియా కప్ టోర్నీ ఈ నెలాఖరు ప్రారంభం కానుంది. ఈ నెల 30 నుంచి మ్యాచులు జరగనున్నాయి.

    2018 తర్వాత మళ్లీ ఈ టోర్నీని 50 ఓవర్ల ఫార్మాట్లో నిర్వహించనున్నారు. ఈ మెగా టోర్నీలోకి మొదటిసారిగా నేపాల్ జట్టు అడుగుపెట్టింది.

    ఇప్పటిదాకా ఈ మెగా టోర్నీలో టీమిండియా జట్టు 49 మ్యాచులను ఆడింది. ఇందులో 31 మ్యాచుల్లో నెగ్గగా, 16 మ్యాచుల్లో ఓటమిపాలైంది. మరో రెండు మ్యాచులు డ్రాగా ముగిశాయి.

    అయితే ఇప్పటివరకూ ఆరుసార్లు టైటిళ్లు గెలుపొందిన జట్టుగా భారత్ రికార్డుకెక్కింది.

    మరోవైపు ఈ టోర్నీలో అత్యధిక మ్యాచులు ఓడిన జట్టుగా పాకిస్థాన్ జట్టు చెత్త రికార్డును మూటకట్టుకుంది.

    Details

    ఐదుసార్లు టైటిల్ ను గెలుచుకున్న శ్రీలంక జట్టు

    పాకిస్థాన్ ఇప్పటివరకూ 45 మ్యాచులను ఆడింది. ఇందులో 26 మ్యాచులను గెలిచి, 18 మ్యాచులలో ఓటమిపాలైంది.

    2014 నుంచి ఆసియా కప్ ఆడుతున్న అప్ఘనిస్తాన్ జట్టు 50 ఓవర్ల ఫార్మాట్లో మొత్తం 9 మ్యాచులను ఆడగా, అందులో కేవలం మూడు మ్యాచులనే గెలిచింది.

    ఇక మెగా టోర్నీలో శ్రీలంక జట్టు మెరుగైన ప్రదర్శన చేస్తూ వస్తోంది. ఇప్పటివరకూ ఐదుసార్లు టైటిల్ ను ఎగరేసుకొనిపోయింది.

    ఈ మెగా టోర్నీలో 50 మ్యాచులు ఆడిన శ్రీలంక జట్టు 34 మ్యాచుల్లో విజయాలను నమోదు చేసింది. 16 మ్యాచుల్లో ఓటమిపాలైంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    క్రికెట్

    తాజా

    INDw vs SLw: మహిళల ముక్కోణపు వన్డే టైటిల్ భారత్‌దే స్మృతి మంధాన
    operation sindoor: ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదు : భారత్  ఆపరేషన్‌ సిందూర్‌
    HYD Metro: ప్రపంచానికి బ్లూప్రింట్‌గా హైదరాబాద్ మెట్రో.. హార్వర్డ్ విశ్వవిద్యాలయం ప్రశంసలు! హైదరాబాద్
    IPL 2025: ఐపీఎల్ 2025కి గ్రీన్ సిగ్నల్.. ఫైనల్ ఎప్పుడంటే..? ఐపీఎల్

    క్రికెట్

    ఆసియా కప్ షెడ్యూల్ విడుదల.. దాయాదుల సమరం ఎప్పుడంటే? టీమిండియా
    గాల్లోకి ఎగిరి ఒంటి చేతితో క్యాచ్ పట్టిన హర్షిత్ రాణా టీమిండియా
    వెస్టిండీస్‌పై విరాట్ సెంచరీ: విదేశాల్లో తిరుగులేని రికార్డు; ఇప్పటివరకు ఎన్ని సెంచరీలు చేసాడంటే?  విరాట్ కోహ్లీ
    Ind vs Wi 2nd Test: పరుగులు చేయకుండా భారత బౌలర్లకు పరీక్ష పెట్టిన విండీస్ బ్యాటర్లు  వెస్టిండీస్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025