LOADING...
Asia Cup 2025 : ఆసియా కప్ హంగామా స్టార్ట్.. షెడ్యూల్, స్టేడియాలు.. టికెట్ల సమాచారం వంటి పూర్తి వివరాలివే!
ఆసియా కప్ హంగామా స్టార్ట్.. షెడ్యూల్, స్టేడియాలు.. టికెట్ల సమాచారం వంటి పూర్తి వివరాలివే!

Asia Cup 2025 : ఆసియా కప్ హంగామా స్టార్ట్.. షెడ్యూల్, స్టేడియాలు.. టికెట్ల సమాచారం వంటి పూర్తి వివరాలివే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 09, 2025
10:00 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆసియా కప్ 2025 సెప్టెంబర్ 9 నుంచి 28 వరకు జరగనుంది. ఈ టోర్నమెంట్‌లో మొత్తం 8 జట్లు పాల్గొంటాయి. ఈ సారి ఆసియా కప్ టీ20 ఫార్మాట్‌లో జరుగుతుంది. రాబోయే టీ20 వరల్డ్ కప్ కోసం జట్లు సిద్ధమయ్యేందుకు ఇది గొప్ప అవకాశం. ప్రస్తుతం ప్రపంచ నంబర్ వన్ జట్టుగా ఉన్న భారత్‌కు సూర్యకుమార్ యాదవ్ నాయకత్వం వహించనున్నాడు. అయితే పాకిస్తాన్, శ్రీలంక, ఆఫ్ఘనిస్థాన్, బంగ్లాదేశ్ వంటి జట్లు గట్టి పోటీ ఇవ్వనున్నాయి. గ్రూపులు గ్రూప్ A : భారత్, యూఏఈ, పాకిస్తాన్, ఒమన్ గ్రూప్ B : శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్, హాంకాంగ్

Details

మ్యాచ్‌ల షెడ్యూల్

సెప్టెంబర్ 9: అఫ్గానిస్థాన్ vs హాంకాంగ్ (అబు దాబి) సెప్టెంబర్ 10: భారత్ vs యూఏఈ (దుబాయ్) సెప్టెంబర్ 11: బంగ్లాదేశ్ vs హాంకాంగ్ (అబు దాబి) సెప్టెంబర్ 12: పాకిస్తాన్ vs ఒమన్ (దుబాయ్) సెప్టెంబర్ 13: బంగ్లాదేశ్ vs శ్రీలంక (అబు దాబి) సెప్టెంబర్ 14: భారత్ vs పాకిస్తాన్ (దుబాయ్) సెప్టెంబర్ 15: యూఏఈ vs ఒమన్ (అబు దాబి), శ్రీలంక vs హాంకాంగ్ (దుబాయ్) సెప్టెంబర్ 16: బంగ్లాదేశ్ vs అఫ్గానిస్థాన్ (అబు దాబి) సెప్టెంబర్ 17: పాకిస్తాన్ vs యూఏఈ (దుబాయ్) సెప్టెంబర్ 18: శ్రీలంక vs అఫ్గానిస్థాన్ (అబు దాబి) సెప్టెంబర్ 19: భారత్ vs ఒమన్ (అబు దాబి)

Details

మ్యాచ్‌ల షెడ్యూల్1/2

సెప్టెంబర్ 20: సూపర్ ఫోర్స్ (B1 vs B2, దుబాయ్) సెప్టెంబర్ 21: సూపర్ ఫోర్స్ (A1 vs A2, దుబాయ్) సెప్టెంబర్ 23: సూపర్ ఫోర్స్ (A2 vs B1, అబు దాబి) సెప్టెంబర్ 24: సూపర్ ఫోర్స్ (A1 vs B2, దుబాయ్) సెప్టెంబర్ 25: సూపర్ ఫోర్స్ (A2 vs B2, దుబాయ్) సెప్టెంబర్ 26: సూపర్ ఫోర్స్ (A1 vs B1, దుబాయ్) సెప్టెంబర్ 28: ఫైనల్ (దుబాయ్)

Details

 జట్ల వివరాలు

భారత జట్టు సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభమన్ గిల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, జితేశ్ శర్మ, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అర్ష్దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, సంజు శాంసన్, హర్షిత్ రాణా, రింకు సింగ్. పాకిస్తాన్ జట్టు సల్మాన్ అలీ అఘా (కెప్టెన్), అబ్రార్ అహ్మద్, ఫహీమ్ అష్రఫ్, ఫఖర్ జమాన్, హారిస్ రౌఫ్, హసన్ అలీ, హసన్ నవాజ్, హుస్సేన్ తలత్, ఖుష్దిల్ షా, మొహమ్మద్ హారిస్, మొహమ్మద్ నవాజ్, మొహమ్మద్ వసీం జూనియర్, సాహిబ్జాదా ఫర్హాన్, సైమ్ అయుబ్, సల్మాన్ మీర్జా, షాహీన్ అఫ్రిది, సూఫియాన్ మోఖీం.

Details

 శ్రీలంక జట్టు

చరిత్ అసలంక (కెప్టెన్), పతుమ్ నిస్సంక, కుశల్ మెండిస్, కుశల్ పెరేరా, నువానిడు ఫెర్నాండో, కమీందు మెండిస్, కమీల్ మిశారా, దసున్ షనక, వనిందు హసరంగా, దునిత్ వెలాలగే, చమిక కరుణరత్నె, మహీష్ తీక్షణ, దుష్మంత చమీర, బినుర ఫెర్నాండో, నువాన్ తుషార, మతీశ పతిరణ. బంగ్లాదేశ్ జట్టు లిట్టన్ దాస్ (కెప్టెన్), తంజిద్ హసన్, పర్వేజ్ హుస్సేన్ ఇమోన్, సైఫ్ హసన్, తౌహిద్ హృదయ్, జాకర్ అలీ అనిక్, షమీమ్ హుస్సేన్, ఖ్వాజీ నూరుల్ హసన్ సోహన్, షక్ మహెది హసన్, రిషద్ హుస్సేన్, నాసుమ్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, తంజిమ్ హసన్ సాకిబ్, తస్కిన్ అహ్మద్, షోరిఫుల్ ఇస్లాం, షైఫ్ ఉద్దీన్.

Details

అఫ్గానిస్థాన్ జట్టు

రషీద్ ఖాన్ (కెప్టెన్), రహ్మానుల్లాహ్ గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్, డార్విష్ రసూలీ, సిదిఖుల్లా అటల్, అజ్మతుల్లా ఒమర్జాయ్, కరీం జనత్, మొహమ్మద్ నబీ, గుల్బదీన్ నైబ్, షరాఫుద్దీన్ అష్రఫ్, మొహమ్మద్ ఇషాక్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, అల్లాహ్ గజన్‌ఫర్, నూర్ అహ్మద్, ఫరీద్ మాలిక్, నవీన్-ఉల్-హక్, ఫజల్హక్ ఫారూఖీ. ఒమన్ జట్టు జతిందర్ సింగ్ (కెప్టెన్), హమ్మద్ మీర్జా, వినాయక్ శుక్లా, సూఫియాన్ యూసుఫ్, ఆశిష్ ఒడేదెరా, ఆమిర్ కలీం, మొహమ్మద్ నదీమ్, సూఫియాన్ మెహమూద్, ఆర్యన్ బిష్ట్, కరణ్ సోనవాలె, జికిరియా ఇస్లాం, హస్నైన్ అలీ షా, ఫైసల్ షా, ముహమ్మద్ ఇమ్రాన్, నదీమ్ ఖాన్, షకీల్ అహ్మద్, సమయ్ శ్రీవాత్సవ.

Details

హాంకాంగ్ జట్టు

యాసిమ్ ముర్తాజా(కెప్టెన్), బాబర్ హయాత్, జీషాన్ అలీ, నియాజకత్ ఖాన్ మొహమ్మద్,నస్రుల్లా రాణా, మార్టిన్ కోయెట్జీ, అన్షుమాన్ రాథ్, కల్హాన్ మార్క్ చల్లు, ఆయుష్ ఆశిష్ శుక్లా, మొహమ్మద్ ఐజాజ్ ఖాన్, అతీఖ్ ఉల్ రెహ్మాన్ ఇక్బాల్, కించిత్ షా, ఆదిల్ మెహమూద్, హరూన్ మొహమ్మద్ అర్షద్, అలీ హసన్, షాహిద్ వసిఫ్, ఘజన్ఫర్ మొహమ్మద్, మొహమ్మద్ వహీద్, అనస్ ఖాన్, ఎహ్సాన్ ఖాన్. యూఏఈ జట్టు ముహమ్మద్ వసీం(కెప్టెన్), ముహమ్మద్ జోహైబ్, ఆసిఫ్ ఖాన్, అలీషాన్ షరాఫు, రాహుల్ చోప్రా, హర్షిత్ కౌషిక్, హైదర్ అలీ, ముహమ్మద్ ఫారూఖ్, రోహిద్ ఖాన్, జునైద్ సిద్ధిఖ్, సిమ్రన్జీత్, ఈతన్ డిసౌజా, ధ్రువ్ పరాశర్, జవాదుల్లా, ఆర్యన్ష్ శర్మ, సాగిర్ ఖాన్, మతిఉల్లా ఖాన్.

Details

రికార్డులు & లైవ్ స్ట్రీమింగ్

లైవ్ స్ట్రీమింగ్ : సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్ టీవీలో ప్రసారం చేస్తుంది. సోనీ లివ్ యాప్, వెబ్‌సైట్‌లో లైవ్ స్ట్రీమింగ్ అందుబాటులో ఉంటుంది. టికెట్లు : ఆన్‌లైన్‌లో లేదా యూఏఈ వేదికల వద్ద బూత్‌లలో కొనుగోలు చేయవచ్చు.

Details

టీ20 ఆసియా కప్ రికార్డులు

అత్యధిక విజయాలు: భారత్ (10లో 8) అత్యధిక పరాజయాలు: పాకిస్తాన్ (10లో 5), హాంకాంగ్ (5లో 5) అత్యధిక స్కోర్: భారత్ - 212/2 vs అఫ్గానిస్థాన్ (2022, దుబాయ్) అత్యల్ప స్కోర్: హాంకాంగ్ - 38/10 vs పాకిస్తాన్ (2022, షార్జా) పరుగుల తేడాతో విజయం: పాకిస్థాన్ 155 పరుగులు vs హాంకాంగ్ (2022, షార్జా) వికెట్ల తేడాతో విజయం: భారత్ 9 వికెట్లు vs యూఏఈ (2016, మిర్పూర్) తక్కువ పరుగుల తేడాతో విజయం: ఒమన్ 5 పరుగులు vs హాంకాంగ్ (2016, ఫతుల్లా) తక్కువ వికెట్ల తేడాతో విజయం: పాకిస్తాన్ 1 వికెట్ vs అఫ్గానిస్థాన్ (2022, షార్జా)

Details

బ్యాటింగ్ రికార్డులు 

అత్యధిక పరుగులు: విరాట్ కోహ్లీ (429 పరుగులు, 10 మ్యాచ్‌లు) అత్యధిక వ్యక్తిగత స్కోర్: విరాట్ కోహ్లీ 122\* vs అఫ్గానిస్థాన్ (2022), బాబర్ హయాత్ 122 vs ఒమన్ (2016) అత్యధిక యావరేజ్: విరాట్ కోహ్లీ (85.80) అత్యధిక స్ట్రైక్ రేట్ (100 బంతులు): నజీబుల్లాహ్ జద్రాన్ (157.14) అత్యధిక 50+ స్కోర్లు: విరాట్ కోహ్లీ (1 సెంచరీ, 3 హాఫ్ సెంచరీలు) అత్యధిక డకౌట్లు: మష్రాఫ్ మొర్తజా (3) అత్యధిక సిక్సులు: నజీబుల్లాహ్ జద్రాన్ (13) ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సులు: బాబర్ హయాత్ (7)

Details

బౌలింగ్ రికార్డులు 

అత్యధిక వికెట్లు: భువనేశ్వర్ కుమార్(13 వికెట్లు, 6 మ్యాచ్‌లు) బెస్ట్ బౌలింగ్: భువనేశ్వర్ కుమార్ - 5/4 vs అఫ్గానిస్థాన్(2022, దుబాయ్) బెస్ట్ ఎకానమీ రేట్: మొహమ్మద్ ఆమిర్(5.06) ఒక సిరీస్‌లో అత్యధిక వికెట్లు: అమ్జద్ జావేద్(12 వికెట్లు, 2016) ఫీల్డింగ్ రికార్డులు అత్యధిక డిస్మిసల్స్: ఎం.ఎస్. ధోనీ, స్వప్నిల్ పాటిల్(7 చొప్పున) అత్యధిక క్యాచ్‌లు: బాబర్ హయాత్, సౌమ్య సర్కార్(6 చొప్పున) అత్యధిక భాగస్వామ్యం: విరాట్ కోహ్లీ - కేఎల్ రాహుల్(119 పరుగులు, 2022) ఇతర రికార్డులు అత్యధిక మ్యాచ్‌లు: విరాట్ కోహ్లీ, దసున్ షనక(10 చొప్పున) కెప్టెన్‌గా అత్యధిక విజయాలు: ఎం.ఎస్. ధోనీ, దసున్ షనక(5 చొప్పున) ఆటగాడిగా అత్యధిక విజయాలు: విరాట్ కోహ్లీ (10లో 8)