Page Loader
Asia Cup : భారత్, పాకిస్థాన్ మ్యాచ్ రద్దు
భారత్, పాకిస్థాన్ మ్యాచ్ రద్దు

Asia Cup : భారత్, పాకిస్థాన్ మ్యాచ్ రద్దు

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 02, 2023
10:20 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆసియా కప్ లో భారత్, పాకిస్థాన్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది.దీంతో ఇరుజట్లు చెరో పాయింట్ పంచుకున్నాయి. టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. భారత్ ఇన్నింగ్స్‌ సమయంలో వర్షం రెండుసార్లు అంతరాయం కలిగించింది. అలాగే బ్యాటింగ్ చేసిన టీమిండియా 48.5 ఓవర్లలో 266 పరుగులకు ఆలౌటైంది. అనంతరం మళ్లీ వర్షం మొదలైంది. ఎంతసేపటికీ వర్షం తగ్గకపోవడంతో మ్యాచును రద్దు చేస్తున్నట్లు ఫీల్డ్ అంపైర్లు ప్రకటించారు. టీమిండియా బ్యాటర్లలో హార్ధిక్ పాండ్యా 87, ఇషాన్ 82 పరుగుల మినహా మిగతా బ్యాటర్లు చేతులెత్తేశారు. దీంతో టీమిండియా తక్కువ పరుగులకే చాప చుట్టేసింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మ్యాచును రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన అంపైర్లు