LOADING...
Asia Cup : భారత్ వర్సెస్ శ్రీలంక.. ఫైనల్‌లో గెలుపు ఎవరిదో?
భారత్ వర్సెస్ శ్రీలంక.. ఫైనల్‌లో గెలుపు ఎవరిదో?

Asia Cup : భారత్ వర్సెస్ శ్రీలంక.. ఫైనల్‌లో గెలుపు ఎవరిదో?

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 28, 2024
11:15 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆసియా కప్‌లో ఫైనల్ పోరుకు రంగం సిద్ధమైంది. ఆదివారం శ్రీలంకలోని దంబుల్లా ఇంటర్నేషన్ స్టేడియంలో జరిగే ఫైనల్లో భారత మహిళల క్రికెట్ జట్టు, శ్రీలంక జట్లు మధ్య ఫైట్ జరగనుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కానుంది. టోర్నీలో ఓటమన్నదే ఎరుగకుండా వరుస విజయాలతో దూకుడు మీదున్న టీమిండియా ఫైనల్లోనూ అదే పునరావృతం చేయాలని భారత జట్టు భావిస్తోంది. ఇప్పటికే ఏడుసార్లు ఆసియా కప్ విజేతగా భారత్ నెగ్గింది.

Details

సూపర్ ఫామ్ లో స్మృతి మంధాన, షెఫాలీ వర్మ

ప్రస్తుతం టీమిండియాకు ఓపెనర్లు స్మృతి మంధాన, షెఫాలీ వర్మ సూపర్ ఉండడం కలిసొచ్చే అంశం. ఇక బౌలింగ్ విభాగంలో రేణుకాసింగ్, అరుంధతి రెడ్డి ప్రత్యర్థి బ్యాటర్లకు వణుకు పుట్టిస్తున్నారు. మరోవైపు ఈ టోర్నీలో అద్భుత ప్రదర్శనతో శ్రీలంక రాణిస్తోంది. సొంతగడ్డపై ఎలాగైనా టైటిల్ గెలుచుకోవాలని గట్టి పట్టుదలతో ఉంది. శ్రీలంక బ్యాటింగ్ విభాగంలో పటిష్టంగా ఉన్నా, బౌలింగ్ విభాగంలో కాస్త బలహీనంగా ఉంది.