Asia Cup : టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్
ఆసియా కప్ 2023 ప్రారంభమైంది. ముల్తాన్ వేదికగా నేడు నేపాల్ తో జరుగుతున్న ఈ వన్డే మ్యాచులో మొదట టాస్ గెలిచిన పాకిస్థాన్ బ్యాటింగ్ ఎంచుకుంది. పిచ్ పొడిగా ఉందని, అందుకే మొదట బ్యాటింగ్ ఎంచుకున్నామని పాక్ కెప్టెన్ బాబార్ అజం పేర్కొన్నారు. అదే విధంగా తమపై ఎలాంటి ఒత్తిడి లేదని, ఆటగాళ్లు ఈ మ్యాచును ఎంజాయ్ చేయాలనుకుంటున్నట్లు ఆజమ్ చెప్పారు. అనంతరం నేపాల్ కెప్టెన్ రోహిత్ పౌడెల్ మాట్లాడుతూ నేపాల్ జట్టుకి ఇది తొలి ఆసియా కప్ టోర్నీ, తమకు ఈ టోర్నీలో ఆడడం చాలా సంతోషంగా ఉందని వెల్లడించారు.
ఇరు జట్లలోని ఆటగాళ్లు వీరే
పాకిస్థాన్ జట్టు బాబర్ ఆజం (కెప్టెన్), షాదాబ్ ఖాన్, ఫఖర్ జమాన్, ఇమామ్ ఉల్ హక్, సల్మాన్ అలీ అఘా, ఇఫ్తీకర్ అహ్మద్, మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), మహ్మద్ నవాజ్, నసీమ్ షా, షాహీన్ షా ఆఫ్రిది, హరీస్ రవూఫ్. నేపాల్ జట్టు కుశాల్ భుర్టెల్, ఆసిఫ్ షేక్, రోహిత్ పౌడెల్ (కెప్టెన్), ఆరిఫ్ షేక్, కుశాల్ మల్లా, దీపేంద్ర సింగ్, గుల్షన్ ఝా, సోంపాల్ కమీ, కరణ్ కెసి, సందీప్ లామిచానే, లలిత్ రాజ్‌బన్షి