Page Loader
భార‌త్‌కు చేరిన పాక్ హాకి జ‌ట్టు.. ఆగస్ట్ 3 నుంచి 12 వరకు  ఆసియా చాంపియ‌న్స్ ట్రోఫీ 
చైన్నైకి చేరిన పాక్ హాకి జ‌ట్టు..ఆగస్ట్ 3 నుంచి ఆసియా చాంపియ‌న్స్ ట్రోఫీ

భార‌త్‌కు చేరిన పాక్ హాకి జ‌ట్టు.. ఆగస్ట్ 3 నుంచి 12 వరకు  ఆసియా చాంపియ‌న్స్ ట్రోఫీ 

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Aug 01, 2023
06:30 pm

ఈ వార్తాకథనం ఏంటి

మ‌రో రెండు రోజుల్లో ఆసియా చాంపియ‌న్స్ ట్రోఫీ హాకీ టోర్న‌మెంట్ ఏడో సీజ‌న్‌ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ హాకీ జ‌ట్టు మంగళవారం భార‌త్‌కు చేరుకుంది. అత్తారీ - వాఘా స‌రిహ‌ద్దు గుండా భారతదేశంలోకి ప్ర‌వేశించిన పాక్ బృందానికి భారత అధికారులు ఘ‌నంగా స్వాగ‌తం ప‌లికారు. ఈ క్రమంలోనే పాకిస్థాన్ కోచ్ ముహ‌మ్మ‌ద్ స‌క్లెయిన్ స్పందించారు. ఆసియా చాంపియ‌న్స్ ట్రోఫీలో ఆడేందుకు తమ జ‌ట్టు చెన్నైకి పయనమైందన్నారు. ఇత‌ర దేశాల‌తో సంబంధాల‌ను దృఢంగా మలుచుకోవాలని ఆశిస్తున్నట్లు వెల్లడించారు. క్రీడలు, సినిమాల ద్వారా ఇండో పాక్ మ‌ధ్య బంధం మరింత బలపడుతుందన్నారు. ఈ మేరకు ఇరుదేశాలది పెద్ద మ‌న‌సు అని, అతిథులను బాగా చూసుకుంటాయని చెప్పుకొచ్చారు.

DETAILS

ఆగ‌స్టు 9న భార‌త్, పాక్ మ్యాచ్

ఉత్కంఠ రేపే భార‌త్, పాక్ మ్యాచ్ ఆగ‌స్టు 9న మొదలుకానుంది. అయితే ఈ ఏడాది భారతదేశం, ఆసియా చాంపియ‌న్స్ ట్రోఫీ హాకీ టోర్న‌మెంట్‌కు హాస్ట్ గా వ్యవరిస్తోంది. ఆగ‌స్టు 3 నుంచి 12 వ‌ర‌కు 10 రోజుల పాటు మెగా ఈవెంట్ జరగనుంది. చెన్నైలోని రాధాకృష్ట స్టేడియంలో పోటీలు జరుగుతున్నాయి. 2011 నుంచి ఏటా ఈ మెగా టోర్నీని ఆసియా హాకీ ఫెడ‌రేష‌న్ నిర్వ‌హిస్తోంది. ఆరంభ సీజ‌న్ 2011, తర్వాత 2016లోనూ టీమిండియా చాంపియ‌న్‌గా నిలిచింది. 2018లో మాత్రం పాక్ దేశంతో కలిసి ట్రోఫీని పంచుకుంది. 2012, 2013లో టైటిల్‌ను పాక్ గెలుచుకుంది. 2021లో ద‌క్షిణ కొరియా ఆసియా చాంపియ‌న్స్ ట్రోఫీ విజేత‌గా కీర్తి గడించింది.