LOADING...
Asian Games: వినేశ్, పునియాకు ట్రయల్స్ నుంచి మినహాయించడంపై విమర్శలు
వినేశ్, పునియాకు ట్రయల్స్ నుంచి మినహాయించడంపై విమర్శలు

Asian Games: వినేశ్, పునియాకు ట్రయల్స్ నుంచి మినహాయించడంపై విమర్శలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 19, 2023
07:37 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆసియా క్రీడల్లో బజ్‌రంగ్ పునియా, వినేశ్ ఫోగాట్ కు నేరుగా ప్రవేశం కల్పించడంపై ప్రస్తుతం వివాదం రాజుకుంది. ట్రయిల్స్ నుంచి వీరిద్దరిని మినహాయింపు కల్పించడంపై డబ్ల్యూఎఫ్ఐ, అడ్‌హక్ కమిటీ చేసిన ప్రకటన మరింత గొడవకు దారి తీసింది. ఈ క్రమంలో భారత ఒలింపిక్ సంఘం (IOA) స్పందించింది. ఆసియా గేమ్స్ కు బయల్దేరే కొద్ది రోజుల ముందు రెజ్లర్ల తుది ఎంపిక ఉంటుందని స్పష్టం చేసింది. నైపుణ్యం, పోటీతత్వంలో తమ టాలెంట్‌ను నిరూపించుకున్న వారికే భారత తరుఫున ప్రాతినిధ్యం వహించే అవకాశం లభిస్తుందని ఒలింపిక్ సంఘం పేర్కొంది.

Details

ఆసియా క్రీడల్లో నేరుగా ప్రవేశం కల్పించడంపై వివాదం

ఒలింపిక్ పతక విజేత బజ్‌రంగ్‌ పునియా (53 కేజీల విభాగంలో), వినేశ్‌ ఫొగాట్‌ (65 కేజీల విభాగంలో)లకు ఆసియా క్రీడల్లో నేరుగా ప్రవేశం కల్పిస్తున్నట్లు అడ్‌హక్‌ కమిటీ పేర్కొనడంతో ఈ వివాదం మొదలైంది. అయితే మిగతా రెజ్లరకు జులై 22-23 తేదీల్లో ట్రయల్స్ నిర్వహించి, ఎంపిక చేస్తామని తెలిపింది. ఆసియా క్రీడలకు మెరుగైన రెజ్లర్లకు పంపించేందుకు ముందుగా, పోటీలకు వెళ్లడానికి కొద్ది రోజుల ముందే రెజ్లర్ల తుది ఎంపికను చేపడుతామని భారత ఒలింపిక్ సంఘం తెలిపింది. దీంతో బజ్‌రంగ్ పునియా, వినేశ్ ఫోగాట్ ట్రయల్స్‌లో పాల్గొంటారా లేదా అనే దానిపై మాత్రం ఐఓఏ ఎటువంటి స్పష్టతను ఇవ్వలేదు.