ఆ బంతి నా ప్యాడ్‌కు తాకి ఉంటే నా కెరీర్‌కు ఎండ్‌కార్డ్ పడేది : అశ్విన్
భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన బౌలింగ్‌తో చాలాసార్లు ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టిన విషయం తెలిసిందే. అతను బౌలింగ్‌లోనే కాకుండా బ్యాటింగ్ లోనూ ఎన్నోసార్లు రాణించాడు. అయితే తన కెరీర్ లో ఓ కీలక మ్యాచు గురించి అశ్విన్ ఐసీసీ ఇంటర్వ్యూలో మాట్లాడారు. గతేడాది టీ20 ప్రపంచ కప్‌లో పాకిస్తాన్ పై చివరి ఓవర్ ఆడడం గురించి అశ్విన్ కీలక విషయాలను వెల్లడించారు.ఈ మ్యాచులో కోహ్లీ 53 బంతుల్లోనే 82 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ను ఆడాడు. అయితే ఆ మ్యాచ్ చివరి బంతి ఆడే అవకాశం తనకు రావడంపై ఆశ్విన్ స్పందించాడు. ఈ ఒక్క బాల్ ఆడటానికి విరాట్ కోహ్లీ తనకు ఏడు ఆప్షన్స్ ఇచ్చినట్లు ఆశ్విన్ తెలిపాడు.
ఆ మ్యాచును తలుచుకుంటే వెన్నులో వణుకు పుడుతుంది
చివరి రెండు బంతులకు రెండు పరుగులు చేయాల్సిన సమయంలో దినేష్ కార్తీక్ స్టంపౌట్‌గా వెనుదిరిగాడు. క్రీజులోకి వచ్చిన అశ్విన్ చివరి బంతికి రెండు పరుగులు అవసరమయ్యాయి. అయితే నవాజ్ వేసిన బంతి వైడ్ అవుతుందని ముందుగానే గ్రహించిన అశ్విన్ ముందుకు జరిగి దానిని వదిలేశాడు. దాంతో చివరి బంతికి ఒక్క పరుగే అవసరం కాగా లాప్టెడ్ షాట్ కొట్టి అశ్విన్ మ్యాచును గెలిపించాడు. పాకిస్థాన్ పై సాధించిన ఆ థ్రిల్లింగ్ విజయాన్ని గుర్తు చేసుకున్నప్పుడల్లా తనకు వెన్నులో వణుకు పుడుతుందని, ఒకవేళ చివరి బంతి తన ప్యాడ్లను తాకి ఉంటే తన కెరీర్ ముగిసిపోయేదని అశ్విన్ చెప్పుకొచ్చాడు. ఆ మ్యాచులో కోహ్లి కళ్లలోకి చూసినప్పుడు అతడు మరో లోకంలో ఉన్నట్లు కనిపించాడన్నారు.