LOADING...
Asian Games 2023: స్టీపుల్‌చేజ్‌, షాట్‌పుట్‌‌లో భారత్‌కు బంగారు పతకాలు 
స్టీపుల్‌చేజ్‌, షాట్‌పుట్‌‌లో భారత్‌కు బంగారు పతకాలు

Asian Games 2023: స్టీపుల్‌చేజ్‌, షాట్‌పుట్‌‌లో భారత్‌కు బంగారు పతకాలు 

వ్రాసిన వారు Stalin
Oct 01, 2023
06:50 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆసియా క్రీడలు 2023లో భారత్‌ను మరో రెండు స్వర్ణ పతకాలు వరించాయి. పురుషుల 3000 మీటర్ల స్టీపుల్‌చేజ్‌, షాట్‌పుట్‌ విభాగాల్లో పతకాలు వచ్చాయి. స్టీపుల్‌చేజ్‌‌లో భారత ఆటగాడు అవినాష్ సేబుల్ ఆసియా క్రీడల రికార్డును బద్దలు కొట్టాడు. 3000 మీటర్ల స్టీపుల్‌చేజ్‌ 8 నిమిషాల 19.54 సెకన్లలో పూర్తి చేసి స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నారు. దీంతో అథ్లెటిక్స్‌లో స్వర్ణ పతకం సాధించిన తొలి భారతీయ అథ్లెట్‌గా అవినాష్ నిలిచారు. ఇక షాట్‌పుట్‌లో భారత 'బాహుబలి' తేజిందర్‌పాల్‌ సింగ్‌ తూర్‌ స్వర్ణం పతకం సాధించాడు. అత్యధికంగా 20.36 మీటర్లు విసిరి తేజిందర్‌పాల్‌ విన్నర్‌గా నిలిచాడు. అంతకుముందు హైదరాబాదీ బాక్సర్ నిఖత్ జరీన్‌ 50కేజీల విభాగంలో కాంస్యాన్ని గెలుచుకుంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

అథ్లెటిక్స్‌లో స్వర్ణ పతకం సాధించిన తొలి భారతీయుడు సేబుల్

ట్విట్టర్ పోస్ట్ చేయండి

 తేజిందర్‌పాల్‌ సింగ్‌‌కు స్వర్ణం