AUS vs IND: రెండో వన్డే లో టీమిండియాపై ఆస్ట్రేలియా విజయం..
ఈ వార్తాకథనం ఏంటి
మూడు వన్డే సిరీస్‌లో భాగంగా అడిలైడ్ ఓవల్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో భారత్ పరాజయం పాలైంది. 265 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ 45.5 ఓవర్లలో 8 వికెట్ల నష్టంతో ఛేదించింది.మాథ్యూ షార్ట్ 78 బంతుల్లో 74 పరుగులు చేసి (4 ఫోర్లు, 2 సిక్స్‌లు) హాఫ్ సెంచరీ సొంతం చేసుకున్నాడు. కూపర్ కొన్నోలీ 51 బంతుల్లో 57 పరుగులు (5 ఫోర్లు, 1 సిక్స్) చేసి జట్టుకు మద్దతు ఇచ్చాడు. అలాగే మిచెల్ ఓవెన్ (36),మాట్ రెన్షా (30)లు ఆస్ట్రేలియా విజయంలో కీలక పాత్ర పోషించారు. భారత బౌలర్లలో హర్షిత్ రాణా, వాషింగ్టన్ సుందర్, అర్షదీప్ సింగ్ తలో రెండు వికెట్లు పడగొట్టారు.
వివరాలు
25న నామమాత్రమైన మూడో వన్డే
ఈ ఓటమితో భారత్ మూడు వన్డేల సిరీస్‌ను కోల్పోయింది. నామమాత్రమైన మూడో వన్డే 25న జరగనుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది. సీనియర్ బ్యాటర్ రోహిత్ శర్మ 97 బంతుల్లో 73 పరుగులు (7 ఫోర్లు, 2 సిక్స్‌లు), స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ 77 బంతుల్లో 61 పరుగులు (7 ఫోర్లు) చేశారు. ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ 41 బంతుల్లో 44 పరుగులతో మంచి ఇన్నింగ్స్ ఆడాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో ఆడమ్ జంపా 4, జేవియర్ బ్రేట్‌లెట్ 3, మిచెల్ స్టార్క్ 2 వికెట్లు పడగొట్టారు.