ఆసీస్ కీపర్‌పై అభిమానుల అగ్రహం.. స్టేడియంలోకి రాగానే!
ఈ వార్తాకథనం ఏంటి
యాషెస్ మూడో టెస్టులో ఇంగ్లండ్ అభిమానులు మరోసారి ఆస్ట్రేలియా ప్లేయర్లపై విరుచుకుపడ్డారు. హెడింగ్లే వేదికగా జరుగుతున్న ఈ టెస్టులో ఆసీస్ మొదట బ్యాటింగ్ చేసింది.
టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో ఆస్ట్రేలియా బ్యాటర్లు కొంచెం తడబడ్డారు.
ఈ క్రమంలో ఆసీస్ వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ బ్యాటింగ్‌కు వచ్చినప్పుడు ఇంగ్లండ్ అభిమానులు అగ్రహం వ్యక్తం చేశారు.
అతను మైదానంలోకి రాగానే 'బూ' అంటూ అతనిపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Details
క్యారీపై మండిపడ్డ ఇంగ్లండ్ అభిమానులు
క్యారీ క్రీజులోకి రాగానే అభిమానులు 'క్యారీ కోపం ఉంటే.. షూస్ తీసేయండి' అంటూ గట్టిగా నినాదాలు చేశారు. ఇంకొక వీడియో లో 'క్యారీ అంటే కోపం ఉంటే నిలబడండి' అంటూ నినాదాలు చేశారు. దీంతో చాలామంది నిలబడే మ్యాచును చూశారు.
లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్టులో ఇంగ్లండ్ స్టార్ జానీ బెయిర్ స్టోను అలెక్స్ క్యారీ స్టంప్ అవుట్ చేసిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం ఈ ఘటనపై 'స్పిరిట్ ఆఫ్ ది క్రికెట్' అంటూ తెగ చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే క్యారీపై ఇంగ్లండ్ అభిమానులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.