Page Loader
IND Vs AUS : చేతులేత్తిసిన ఆసీస్ బ్యాటర్లు.. భారత్ టార్గెట్ ఎంతంటే? 
చేతులేత్తిసిన ఆసీస్ బ్యాటర్లు.. భారత్ టార్గెట్ ఎంతంటే?

IND Vs AUS : చేతులేత్తిసిన ఆసీస్ బ్యాటర్లు.. భారత్ టార్గెట్ ఎంతంటే? 

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 08, 2023
06:44 pm

ఈ వార్తాకథనం ఏంటి

వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా చైన్నై వేదికగా జరుగుతున్న మ్యాచులో ఆస్ట్రేలియా బ్యాటర్లు తడబడ్డారు. భారత స్పిన్ దెబ్బకు ఆసీస్ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూకట్టారు. కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా స్పిన్ మాయజాలతో ఆసీస్ 49.3 ఓవర్లలో 199 పరుగులకు ఆలౌటయ్యారు. మొదట మిచెల్ మార్ష్ డకౌట్ కాగా, డేవిడ్ వార్నర్ (41), స్టీవన్ స్మిత్ 46) ఫర్వాలేదనిపించారు. మిగతా బ్యాటర్లు విఫలం కావడంతో ఆసీస్ తక్కువ పరుగులకే చాప చుట్టేసింది. చివర్లో స్టార్క్ రాణించడంతో ఆసీస్ 199 పరుగుల మార్కును చేరుకోగలిగింది. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా 3, కుల్దీప్ యాదవ్ 2, జస్ప్రిత్ బుమ్రా 2, అశ్విన్, హార్ధిక్ , సిరాజ్ తలా ఓ వికెట్ తీశారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

భారత్ లక్ష్యం 200 పరుగులు