IND vs AUS: గబ్బా టెస్ట్ కోసం ప్లేయింగ్ XI ప్రకటించిన ఆస్ట్రేలియా .. వికెట్ల వీరుడు వచ్చేశాడు
క్రికెట్ ఆస్ట్రేలియా బ్రిస్బేన్ వేదికగా టీమిండియాతో జరగనున్న మూడో టెస్టు కోసం తుది జట్టును ప్రకటించింది. రెండో టెస్టులో గాయంతో దూరమైన జోష్ హేజిల్‌వుడ్ తిరిగి జట్టులోకి వచ్చాడు. దీంతో స్కాట్ బోలాండ్ మళ్లీ బెంచ్‌కే పరిమితమవ్వాల్సి వచ్చింది. జట్టులో ఇది మాత్రమే మార్పు కాగా, మిగిలిన జట్టులో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. తొలి రెండు టెస్టుల్లో విఫలమైన మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్‌లకు జట్టు మేనేజ్‌మెంట్ మరోసారి అవకాశమిచ్చింది. అడిలైడ్ టెస్టులో బోలాండ్ 5 వికెట్లు తీసి మెరుగైన ప్రదర్శన కనబరిచినా, హేజిల్‌వుడ్ పూర్తి ఫిట్‌నెస్ సాధించడంతో అతన్ని పక్కన పెట్టక తప్పలేదని ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ చెప్పాడు.
భారత జట్టులో కూడా మార్పులకు అవకాశాలు.
శనివారం (డిసెంబర్ 14) ప్రారంభం కానున్న ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు తమ ప్రదర్శనతో ఆకట్టుకోవాలని భావిస్తున్నాయి. భారత జట్టులో కూడా మార్పులకు అవకాశాలు. హర్షిత్ రాణా, అశ్విన్ స్థానాల్లో ప్రసిద్ధ్ కృష్ణ, జడేజాలు జట్టులోకి చేరే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. మొదటి టెస్టులో టీమిండియా ఆసీస్‌ను 295 పరుగుల తేడాతో ఓడించగా, రెండో టెస్టులో ఆసీస్ 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ప్రస్తుతం ఐదు మ్యాచ్‌ల సిరీస్ 1-1తో సమంగా ఉంది. ఆస్ట్రేలియా: ఉస్మాన్ ఖవాజా, నాథన్ మెక్‌స్వీనీ, మార్నస్ లాబుస్‌చాగ్నే, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, మిచ్ మార్ష్, అలెక్స్ కారీ (వికెట్ కీప్) పాట్ కమిన్స్, మిచ్ స్టార్క్, నాథన్ లియాన్, జోష్ హాజిల్‌వుడ్