Josh Inglis: ఆస్ట్రేలియా కెప్టెన్‌గా జోష్ ఇంగ్లిస్ నియామకం
ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు, పాకిస్థాన్‌తో జరగనున్న టీ20 సిరీస్‌కు జోష్ ఇంగ్లిస్‌ను కెప్టెన్‌గా ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు నియమించింది. పెర్త్‌లో జరుగుతున్న వన్డే సిరీస్ చివరి మ్యాచ్‌లోనూ ఇంగ్లిస్ ఆస్ట్రేలియా జట్టుకు నాయకత్వం వహించనున్నారు. ఈ నేపథ్యంలో, ఇంగ్లిస్ వన్డే జట్టులో పాట్ కమిన్స్‌ను, టీ20లో మిచెల్ మార్ష్‌ను భర్తీ చేస్తారు. జోష్ ఇంగ్లిస్, ఆస్ట్రేలియాకు వన్డేలో 30వ కెప్టెన్‌గా, టీ20లో 14వ కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. పాకిస్థాన్‌తో జరిగే వైట్ బాల్ సిరీస్‌లో ఇంగ్లిస్ కేవలం తాత్కాలిక కెప్టెన్‌గా ఉన్నారు. ఈ నిర్ణయం వెనుక ముఖ్య కారణం బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ కోసం ఆటగాళ్లను సిద్ధం చేయడం.
టెస్టు సిరీస్ కు సిద్ధమవుతున్న ఆసీస్ సీనియర్ ఆటగాళ్లు
నవంబర్ 22 నుండి భారత్-ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ ప్రారంభంకానుండడంతో రెగ్యులర్ వన్డే కెప్టెన్ పాట్ కమిన్స్, టీ20 కెప్టెన్ మిచెల్ మార్ష్ తదితరులు టెస్ట్ సిరీస్‌కు ప్రాధాన్యం ఇస్తూ సన్నద్ధమవుతున్నారు. అందుకే పాకిస్థాన్‌తో సిరీస్‌లో వారు పాల్గొనడం లేదు. పాకిస్థాన్‌తో మూడో వన్డే నవంబర్ 10న జరగనుండగా, ఆ తర్వాత నవంబర్ 18 వరకు మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభమవుతుంది. ప్రస్తుతం రెండో వన్డేలో పాట్ కమిన్స్ కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ మ్యాచ్ అనంతరం, మిచెల్ స్టార్క్, జోష్ హేజిల్‌వుడ్, స్టీవ్ స్మిత్ వంటి ఆటగాళ్లు వన్డే సిరీస్ నుంచి వైదొలిగి, భారత టెస్ట్ సిరీస్‌కు సిద్ధం కానున్నారు.