
Team India: టీమిండియా 'మెగా సెంచరీ'పై కన్నేసిన ఆస్ట్రేలియా
ఈ వార్తాకథనం ఏంటి
వన్డే వరల్డ్ కప్ 2023 ప్రారంభానికి ఇంకా మూడ్రోజులే సమయం ఉంది.
తమ అభిమాన క్రికెటర్లు ఈ మెగా టోర్నీలో సెంచరీల మోత మోగించాలని అభిమానులు ఇప్పటికే భారీ అంచనాలు పెట్టుకున్నారు.
1975 వరల్డ్ కప్ ద్వారా వన్డే ప్రపంచ కప్ టోర్నీ మొదలైంది. ఈ మెగా టోర్నీలలో అత్యధిక సెంచరీల చేసిన రికార్డు భారత్ పేరిట ఉంది.
13వ ఎడిషన్ ప్రారంభానికి కంటే ముందుగానే ఆ రికార్డుపై ఆస్ట్రేలియా కన్నేసింది.
గత 12 ప్రపంచ కప్ టోర్నీలో భారత ఆటగాళ్లు మొత్తం 32 సెంచరీలు సాధించగా, ఆస్ట్రేలియా ప్లేయర్లు 31 సెంచరీలు చేశారు. అంటే భారత్, ఆస్ట్రేలియాకి మధ్య ఒక్క సెంచరీ మాత్రమే తేడా ఉంది.
Details
ఆక్టోబర్ 8న టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్
ఆక్టోబర్ 8న ఆస్ట్రేలియా, టీమిండియా మధ్య వన్డే వరల్డ్ కప్ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో ఇరు జట్లకు ఇదే తొలి మ్యాచ్ కావడంతో ఇందులో ఏ ఆసీస్ బ్యాటర్ సెంచరీ సాధించినా భారత్ పేరిట ఉన్న ప్రపంచ కప్ సెంచరీ రికార్డు సమం అయ్యే అవకాశం ఉంది.
వరల్డ్ కప్ టోర్నీలలో ఆయా జట్లు సాధించిన సెంచరీల సంఖ్య
భారత్- 32 సెంచరీలు
ఆస్ట్రేలియా - 31 సెంచరీలు
శ్రీలంక - 25 సెంచరీలు
వెస్టిండీస్ - 19 సెంచరీలు
ఇంగ్లాండ్ - 18 సెంచరీలు
న్యూజిలాండ్ - 17 సెంచరీలు
పాకిస్థాన్ - 16 సెంచరీలు దక్షిణాఫ్రికా - 15 సెంచరీలు
జింబాబ్వే - 6 సెంచరీలు