మాక్స్‌వెల్, మార్ష్ వచ్చేశాడు, టీమిండియాతో వన్డేలకు ఆస్ట్రేలియా జట్టు ఎంపిక
మార్చి 17 నుంచి టీమిండియా-ఆస్ట్రేలియా మధ్య వన్డే సిరీస్ ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా జట్టు ఆ దేశ క్రికెట్ టీం ప్రకటించింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ల కోసం 16 మంది సభ్యులతో కూడిన జట్టును ఆస్ట్రేలియా ఎంపిక చేసింది. గాయం నుంచి కోలుకున్న ఆల్ రౌండర్లు మాక్స్‌వెల్, మిచిల్ మార్స్, పేసర్ జై రిచర్డసన్ తిరిగి వన్డే జట్టులో చోటు సంపాదించుకున్నారు. గాయపడిన జోష్ హేజిల్‌వుడ్ వన్డే జట్టుకు దూరమయ్యాడు. ఈ ఏడాది చివర్లో భారత్‌లో వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకొని ఆస్ట్రేలియా ఈ టీంను ప్రకటించింది. ప్రస్తుతం బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా రెండు టెస్టులో ఓడిపోయింది. టీమిండియా 2-0తో అధిక్యంలో నిలిచింది
టీమిండియాతో తలపడే ఆస్ట్రేలియా జట్టు ఇదే
మ్యాక్స్‌వెల్ గతేడాది నవంబర్ లో సర్జరీ చేయించుకున్నాడు. ఇప్పుడు గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాడు. ఈ వారమే విక్టోరియా టీమ్ తరఫున షెఫీల్డ్ షీల్డ్ ట్రోఫీ బరిలోకి దిగాడు. ఇక ఎడమ మడమ గాయానికి గురై సర్జరీ చేయించుకున్న మిచెల్ మార్ష్ కూడా ఇప్పుడు కోలుకొని మళ్లీ ఆస్ట్రేలియా టీమ్ లో అడుగుపెడుతున్నాడు. మార్చి 17 నుంచి 22 వరకూ ఈ మూడు వన్డేల సిరీస్ జరగనుంది. ఈ మ్యాచ్ లు ముంబై, విశాఖపట్నం, చెన్నైలలో జరుగుతాయి. ఆస్ట్రేలియా వన్డే జట్టు: పాట్ కమిన్స్ (కెప్టెన్), సీన్అబాట్, అష్టన్అగర్, అలెక్స్‌కారీ, కామెరాన్‌గ్రీన్, ట్రావిస్‌హెడ్, జోష్ ఇంగ్లిస్, లాబుస్‌చాగ్నే, మిచెల్‌మార్ష్, మాక్స్‌వెల్, జ్యే రిచర్డ్‌సన్, స్టీవ్‌స్మిత్, మిచెల్ స్టార్క్, స్టోయినిస్, వార్నర్, ఆడమ్ జంపా