LOADING...
Australia Open: సెమీస్‌కు అర్హత సాధించిన ప్రణయ్, ప్రియాన్షు
సెమీస్‌ లో అడుగుపెట్టిన హెచ్ఎస్ ప్రణయ్

Australia Open: సెమీస్‌కు అర్హత సాధించిన ప్రణయ్, ప్రియాన్షు

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 04, 2023
06:04 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆస్ట్రేలియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత షట్లర్లు హెచ్ఎస్ ప్రణయ్, ప్రియాన్షు సత్తా చాటుతున్నారు. ఈ టోర్నీలో వారిద్దరూ సెమీస్‌కు అర్హత సాధించారు. ప్రపంచ నెంబర్ 9వ ర్యాంకులో ఉన్న ప్రణయ్ హెచ్ఎస్ ఈ ఏడాది మూడోసారి బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూరు ఈవెంట్ లో సెమీస్ లోకి చేరారు. టోక్యో ఒలింపిక్ బ్రాంజ్ మెడల్ ను కైవసం చేసుకున్న ఇండోనేషియా ప్లేయర్ ఆంథోనీ గిన్ టింగ్ పై 16-21, 21-17, 21-14 తేడాతో ప్రణయ్ చిత్తు చేశాడు. సెమీస్‌లో వ‌ర‌ల్డ్ నెంబ‌ర్ 31 ర్యాంక్ ప్లేయ‌ర్ ప్రియాన్షు ర‌జావ‌త్‌తో ప్ర‌ణ‌య్ పోటీపడనున్నాడు.

Details

కిందాబి శ్రీకాంత్ పై విజయం సాధించిన ప్రియన్షు

కిదాంబి శ్రీకాంత్ పై 21-13, 21-8 తేడాతో ప్రియన్షు విజయం సాధించాడు. వరల్డ్ టూర్ సూపర్ ఈవెంట్లో తొలిసారిగా సెమీస్ లోకి ప్రియన్షు అడుగుపెట్టడం విశేషం. శుక్రవారం ఉదయం జరిగిన మహిళల క్వార్టర్స్ లో పివి.సింధు ఓటమిపాలైన విషయం తెలిసిందే. దీంతో ఆస్ట్రేలియా ఓపెన్ నుంచి ఆమె నిష్క్రమించింది. సింగిల్స్ క్వార్టర్స్ ఫైనల్స్ లో అమెరికాకు చెందిన బీవెన్ జాంగ్ చేతిలో 21-12, 21-17 తేడాతో పీవీ సింధు ఓటమిపాలైంది.