Page Loader
టీమిండియాతో వన్డే సిరీస్‌కు ముందు ఆస్ట్రేలియాకు బిగ్ షాక్
రిచర్డ్‌సన్ చివరిసారిగా జూన్ 2022లో ఆస్ట్రేలియా తరపున ఆడాడు

టీమిండియాతో వన్డే సిరీస్‌కు ముందు ఆస్ట్రేలియాకు బిగ్ షాక్

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 06, 2023
03:30 pm

ఈ వార్తాకథనం ఏంటి

మార్చి 17 నుంచి టీమిండియాతో ఆస్ట్రేలియా మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను ఆడనుంది. వన్డే సిరీస్‌కు ముందు ఆస్ట్రేలియాకు భారీ షాక్ తగిలింది. వన్డే జట్టుకు ఎంపికైన స్టార్ బౌలర్ జై రిచర్డర్ సన్ గాయం కారణంగా సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. అతని స్థానంలో పేసర్ నాథన్ ఎల్లిస్‌ని ఎంపిక చేశారు. ఐపీఎల్ తరుపున ముంబై ఇండియన్స్ ఆడుతున్న రిచర్డ్ సన్, ఈ మెగా టోర్నికి దూరం కానున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా తెలిపింది. రిచర్డ్‌సన్ తన అంతర్జాతీయ కెరీర్‌ను గొప్పగా ప్రారంభించినప్పటికీ తరుచూ గాయాల భారీన పడుతూ అంతర్జాతీయ మ్యాచ్‌లకు దూరమవుతున్నాడు.

ఆస్ట్రేలియా

మార్చి 17 నుంచి వన్డే సిరీస్ ప్రారంభం

బిగ్ బాష్ లీగ్ సందర్భంగా గాయపడిన రిచర్డ్ సన్.. తాజాగా ఓ లోకల్ మ్యాచ్ ఆడుతూ గాయపడడ్డాడు. మార్చి 17, 19, 222 తేదీల్లో భారత్‌తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం ఎంపిక చేసిన 16 మంది సభ్యుల ఆసీస్ బృందంలో రిచర్డ్‌సన్ ఉన్నారు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ నాలుగో టెస్టు మ్యాచ్ ముగిసిన అనంతరం ఆసీస్- టీమిండియా వన్డేలలో తలపడనున్నాయి. ఆసీస్‌తో నాలుగో టెస్ట్‌లో టీమిండియా విజయం సాధిస్తే.. వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు కూడా అర్హత సాధిస్తుంది.