Page Loader
క్రికెట్ గుడ్‌బై చెప్పిన ఆస్ట్రేలియా మాజీ టెస్ట్ కెప్టెన్
ఆస్ట్రేలియా తరపున 35 టెస్టులు ఆడిన టిమ్ పైన్

క్రికెట్ గుడ్‌బై చెప్పిన ఆస్ట్రేలియా మాజీ టెస్ట్ కెప్టెన్

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 17, 2023
01:31 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ టిమ్ పైన్ అన్ని ఫార్మట్లకు కొన్నేళ్లుగా దూరంగా ఉన్న విషయం తెలిసిందే. సెక్సెటింగ్ కుంభకోణం కారణంగా నవంబర్ 21లో అతను టెస్టు కెప్టెన్‌గా అప్పట్లో వైదొలిగాడు. తాజాగా అన్ని ఫార్మట్లకు రిటైర్మెట్ ప్రకటిస్తున్నట్లు టిమ్ పైన్ ప్రకటించాడు. 2021లో టీమిండియాతో చివరి సారిగా టెస్టు మ్యాచ్ ఆడాడు. ఒక దశాబ్దం తన క్రికెట్ కెరీర్‌ను కొనసాగించారు. పైన్ 35 టెస్టుల్లో 32.63 సగటుతో 1,534 పరుగులు చేశాడు. ఇందులో తొమ్మిది అర్ధ సెంచరీలను బాదాడు. టెస్టులో అత్యధికంగా 92 పరుగులు చేశాడు.

టిమ్ ఫైన్

2018 టెస్టు కెప్టెన్‌గా ఎంపికైన టిమ్ ఫైన్

2017లో ఒక మహిళా సహోద్యోగితో లైంగికంగా గ్రాఫిక్ టెక్స్ట్ మెసేజ్‌ల మార్పిడి జరిగిందని బహిరంగంగా వెల్లడించినందుకు టెస్ట్ కెప్టెన్‌గా గతంలో టిమ్ ఫైన్ నిష్క్రమించాడు. పైన్ మార్చి 2018లో 46వ ఆస్ట్రేలియన్ టెస్ట్ కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. సెక్స్టింగ్ అంటే స్త్రీ, పురుషుడు వారికి సంబంధించిన నగ్న ఫొటోలు, వీడియోలు ఒకరికొకరు షేర్ చేసుకోవడం