LOADING...
Australia: వన్డే ప్రపంచకప్‌ 2025లో అజేయంగా ఆస్ట్రేలియా.. వరుస విజయాలతో సెమీస్‌కి.. 
వన్డే ప్రపంచకప్‌ 2025లో అజేయంగా ఆస్ట్రేలియా.. వరుస విజయాలతో సెమీస్‌కి..

Australia: వన్డే ప్రపంచకప్‌ 2025లో అజేయంగా ఆస్ట్రేలియా.. వరుస విజయాలతో సెమీస్‌కి.. 

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 17, 2025
09:54 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇండియా, శ్రీలంక వేదికగా జరుగుతున్న మహిళల వన్డే ప్రపంచ కప్ 2025లో ఆస్ట్రేలియా జట్టు అజేయ శక్తిగా దూసుకెళ్తోంది. ఇప్పటివరకు ఆడిన అన్ని మ్యాచ్‌ల్లో ఆసీస్ గెలిచింది. వరుస విజయాలతోనే సెమీస్‌లో అడుగుపెట్టిన మొదటి జట్టు కూడా ఆస్ట్రేలియా కావడం విశేషం. ఈ మెగా టోర్నీలో ఆసీస్ మొత్తం 5 మ్యాచ్‌లు ఆడింది. వాటిలో 4 విజయం సాధించగా, 1 మ్యాచ్ రద్దయింది. నాలుగు కంటే ఎక్కువ జట్లు 9 పాయింట్లు సాధించే అవకాశం లేకపోవడంతో.. ఆస్ట్రేలియాకు సెమీస్‌ బెర్తు ఖరారయింది. విశాఖపట్టణం వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో కంగారూ జట్టు బ్యాటింగ్, బౌలింగ్ రెండూ చక్కగా నిర్వర్తించింది.

వివరాలు 

కెప్టెన్ అలీసా హీలీ అద్భుత ప్రదర్శన

డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఆస్ట్రేలియాకు ఏ దశలోనూ బంగ్లా పోటీ ఇవ్వలేదు. మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్‌ 50 ఓవర్లలో 9 వికెట్లకు కేవలం 198 పరుగులే చేసింది. బంగ్లాదేశ్ తరఫున శోభన 66 రన్‌లతో అవుట్ కాకుండా టాప్ స్కోరర్‌గా నిలిచింది. ఛేదనలో ఆస్ట్రేలియా కెప్టెన్ అలీసా హీలీ (113 నాటౌట్; 77 బంతుల్లో 20×4) అద్భుత ప్రదర్శనతో మరో అజేయ సెంచరీ నమోదు చేసింది. హీలీ రెచ్చిపోవడంతో ఆసీస్ జట్టు 24.5 ఓవర్లలోనే వికెట్‌ కోల్పోకుండా లక్ష్యం చేరుకుంది. ఓపెనర్ ఫోబి లిచ్‌ఫీల్డ్ 84 రన్‌లతో మెరుపులు ఆడి జట్టుకు కీలక సహకారం అందించింది.