Page Loader
AUS Vs SA: ఫైనల్లో భారత్‌తో తలపడేది ఆస్ట్రేలియాలినే.. సౌతాఫ్రికా ఓటమి
ఫైనల్లో భారత్‌తో తలపడేది ఆస్ట్రేలియాలినే.. సౌతాఫ్రికా ఓటమి

AUS Vs SA: ఫైనల్లో భారత్‌తో తలపడేది ఆస్ట్రేలియాలినే.. సౌతాఫ్రికా ఓటమి

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 16, 2023
10:12 pm

ఈ వార్తాకథనం ఏంటి

కోల్ కతా లోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా రెండో సెమీ ఫైనల్ మ్యాచులో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచులో దక్షిణాఫ్రికాపై ఆస్ట్రేలియా 3 వికెట్ల తేడాతో గెలుపొంది ఫైనల్‌కి దూసుకెళ్లింది. మొదట బ్యాటింగ్ చేసిన సౌత్ ఆఫ్రికా 49.2 ఓవర్లలో కేవలం 212 పరుగులు చేసి ఆలౌటైంది. ఆస్ట్రేలియా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో సౌతాఫ్రికా బ్యాటర్లు చేతులెత్తేశారు. డేవిడ్ మిల్లర్ 101 శతకంతో రాణించడంతో ఆ జట్టు గౌరవప్రదమైన స్కోరును చేసింది. ఆసీస్ బౌలర్లలో స్టార్క్, కమిన్స్ తలా మూడు వికెట్లు తీయగా, హెడ్, జోష్ హాజిల్‌వుడ్ రెండు వికెట్లు పడగొట్టారు.

Details

నవంబర్ 19న భారత్, ఆస్ట్రేలియా మధ్య ఫైనల్ మ్యాచ్

లక్ష్య చేధనకు ఆసీస్ తక్కువ స్కోరును చేధిచేందుకు పోరాడాల్సి వచ్చింది. ఓపెనర్లు డేవిడ్ వార్నర్ (29), ట్రావిస్ హెడ్ (62) జట్టుకు మంచి ఆరంభాన్ని అందించారు. మిచెల్ మార్ష్(0), లబుషన్(18), మాక్స్ వెల్(1)ను సౌతాఫ్రికా స్పిన్నర్లు త్వరగా పెవిలియానికి చేరడంతో ఆసీస్ కష్టాల్లో పడింది. స్టీవన్ స్మిత్ (30), జోష్ ఇంగ్లిస్ 28 రన్స్ తో పోరాడారు. చివర్లో కమిన్స్14*, స్టార్క్ 16* పరుగులతో జట్టుకు విజయాన్ని అందించారు. దీంతో ఆసీస్ 48.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించింది. సౌతాఫ్రికా బౌలర్లలో షమ్సీ, కోయెట్జీ రెండు వికెట్లు తీయగా, మార్కరమ్, రబడ, మహరాజ్ తలా ఓ వికెట్ తీశారు. ఈ విజయంలో నవంబర్ 19న ఫైనల్లో భారత్‌తో ఆస్ట్రేలియా తలపడనుంది.