Page Loader
Aus vs Eng : ఇంగ్లిష్ వీరోచిత పోరాటం.. ఆస్ట్రేలియా గ్రాండ్ విక్టరీ
ఇంగ్లిష్ వీరోచిత పోరాటం.. ఆస్ట్రేలియా గ్రాండ్ విక్టరీ

Aus vs Eng : ఇంగ్లిష్ వీరోచిత పోరాటం.. ఆస్ట్రేలియా గ్రాండ్ విక్టరీ

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 22, 2025
10:37 pm

ఈ వార్తాకథనం ఏంటి

చాంపియన్ ట్రోఫీలో భాగంగా ఇవాళ ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచులో ఆస్ట్రేలియా ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ జట్లు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 351 పరుగుల భారీ స్కోరును సాధించింది. ఈ టార్గెట్ ను ఆస్ట్రేలియా 47.3 ఓవర్లలోనే చేధించింది. ఆస్ట్రేలియా బ్యాటర్లలో జోష్ ఇంగ్లిస్ 120 పరుగుల అద్భుత శతకంతో చెలరేగడంతో ఆసీస్ గెలుపొందింది. మాథ్యూ షార్ట్ 63 పరుగులు, అలెక్స్ క్యారీ 69 పరుగులు, మార్నస్ లాబుస్చాగ్నే 47 పరుగులతో ఫర్వాలేదనిపించారు.

Details

3 వికెట్లతో చెలరేగిన బెన్ ద్వార్షుయిస్

ఇంగ్లండ్ బౌలర్లలో మార్క్ వుడ్, జోఫ్రా ఆర్చర్, అదిల్ రషీద్, లివింగ్ స్టోన్, బ్రైడన్ కార్సే తలా ఓ వికెట్ తీశారు. ఇంగ్లండ్ బ్యాటర్లలో బెన్ డకెట్ 165 పరుగులతో రాణించడంతో ఆ జట్టు భారీ స్కోరు సాధించింది. రూట్ 68 పరుగులతో రాణించారు. ఆస్ట్రేలియా బౌలర్లలో బెన్ ద్వార్షుయిస్ 3 వికెట్లు, జంపా, లబుస్నాగ్నే తలా రెండు వికెట్లు తీశారు.