Australian Open 2025: గాయంతో సెమీ-ఫైనల్ నుండి వైదొలిగిన నొవాక్ జకోవిచ్
ఈ వార్తాకథనం ఏంటి
కెరీర్‌లో 25వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను సాధించాలనే లక్ష్యంతో ఉన్న సెర్బియా టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్‌కు గాయం పెద్ద ఇబ్బంది తెచ్చింది.
ఆస్ట్రేలియన్ ఓపెన్ 2025 (Australian Open 2025) సెమీస్‌లో అలెగ్జాండర్ జ్వెరెవ్‌తో జరిగిన మ్యాచ్‌లో బరిలోకి దిగిన జకోవిచ్ తొలి సెట్ అనంతరం గాయంతో బయటకు వెళ్లిపోయాడు.
గాయం కారణంగా ఈ నిర్ణయం తీసుకొన్నట్లు వెల్లడించి, అభిమానులకు అభివాదం చేసి కోర్టును వీడాడు.
ఈ పరిణామంతో ఫ్యాన్స్ తీవ్ర షాక్‌కు గురయ్యారు.ఆ తర్వాత,జర్మనీ టెన్నిస్ స్టార్ జ్వెరెవ్ ఆస్ట్రేలియన్ ఓపెన్ 2025 ఫైనల్‌కు చేరుకున్నాడు.
ఇవాళ జరిగే రెండో సెమీస్‌లో విజేతగా నిలిచే ఆటగాడితో జ్వెరెవ్ టైటిల్ కోసం పోరాడనున్నారు.
వివరాలు
తొలి సెట్ సుదీర్ఘంగా..
ఆ సెమీస్‌లో ఇటలీకి చెందిన డిఫెండింగ్ ఛాంపియన్ సినర్, అమెరికా సంచలనం బెన్ షెల్టన్‌తో తలపడనున్నారు.ఆదివారం ఆస్ట్రేలియన్ ఓపెన్ 2025 ఫైనల్ జరుగనుంది.
ఛాంపియన్లు ఒకే మ్యాచ్‌లో గెలిచేందుకు ఎలా పోరాడుతారో తెలిపే ఉదాహరణగా ఆస్ట్రేలియన్ ఓపెన్ తొలి సెమీస్ నిలిచింది.
గాయం బాధ ఉన్నా,జకోవిచ్ మాత్రం పట్టుపట్టినట్లే కనిపించాడు.మరోవైపు,జ్వెరెవ్ కూడా అద్భుతమైన ఆట ప్రదర్శించాడు.
దాదాపు 1 గంట 21 నిమిషాల పాటు సాగిన తొలి సెట్‌ను జ్వెరెవ్ 7-6 (7/5)తో గెలిచాడు.
ఈ సెట్లో ఒక పాయింట్ కోసం ఇద్దరు ఆటగాళ్లూ తీవ్రమైన పోరాటం సాగించారు.
ఒకరి సర్వీస్‌ను మరొకరు బ్రేక్ చేసి ముందుకు సాగారు. అయినప్పటికీ, చివరికి జ్వెరెవ్ విజయం సాధించాడు. మొదటి సెట్ ముగియగానే జకోవిచ్ వైదొలగిపోయాడు.