
Mitchell Starc : మిచెల్ స్టార్క్ షాకింగ్ నిర్ణయం.. టీ20 ఫార్మాట్‌కు వీడ్కోలు
ఈ వార్తాకథనం ఏంటి
ఆస్ట్రేలియా వెటరన్ ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ అంతర్జాతీయ టీ20 క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. ఈ ఫార్మాట్ నుంచి తన రిటైర్మెంట్‌ను అధికారికంగా ప్రకటిస్తూ అభిమానులకు షాక్ ఇచ్చాడు. 35 ఏళ్ల స్టార్క్ 2024 టీ20 వరల్డ్‌కప్ ఫార్మాట్ కు దూరంగా ఉంటున్నాడు. ఇకముందు తన ప్రాధాన్యత టెస్టులు, వన్డే క్రికెట్‌కే పరిమితం అవుతుందని స్పష్టం చేశాడు. అయితే, దేశవాలీ లీగ్‌లు, ముఖ్యంగా ఐపీఎల్ వంటి ఫ్రాంచైజీ టోర్నీలలో మాత్రం కొనసాగుతానని తెలిపాడు. 2012లో అంతర్జాతీయ టీ20ల్లో తన అరంగేట్రం చేసిన స్టార్క్ ఇప్పటివరకు 65 మ్యాచ్‌లు ఆడి, 79 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.
వివరాలు
2027 వరల్డ్ కప్ కోసం ఎదరు చూస్తున్న: స్టార్క్
ఆస్ట్రేలియా తరపున ఆడిన ప్రతి మ్యాచ్ తన కెరీర్‌లో ప్రత్యేకమైన అనుభవమని ఆయన గుర్తుచేసుకున్నాడు. ముఖ్యంగా 2021 టీ20 వరల్డ్‌కప్ విజయాన్ని హైలెట్‌గా అభివర్ణించాడు. తన రిటైర్మెంట్ సందేశంలో స్టార్క్.. "టీ20 ఫార్మాట్‌లో గడిపిన ప్రతి క్షణాన్ని నేను ఆస్వాదించాను. కానీ, నా మొదటి ప్రాధాన్యత ఎప్పుడూ టెస్టులకే ఉంటుంది" అని పేర్కొన్నాడు. భవిష్యత్తులో భారత్ పర్యటన, యాషెస్ సిరీస్, 2027 వన్డే వరల్డ్‌కప్ వంటి ప్రధాన టోర్నీల్లో తన శ్రేష్ఠతను చూపేందుకు ఫిట్‌గా ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నానని వెల్లడించాడు. ఈ నేపథ్యంలో, అంతర్జాతీయ టీ20 ఫార్మాట్ నుంచి తప్పుకోవడం తన కెరీర్‌లో అవసరమైన నిర్ణయమని స్టార్క్ వెల్లడించాడు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
టీ20 ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన మిచెల్ స్టార్క్
🚨 MITCHELL STARC HAS ANNOUNCED HIS RETIREMENT FROM T20I 🚨
— Johns. (@CricCrazyJohns) September 2, 2025
- He will focus on Tests & ODIs, Thank you Cricket Icon. pic.twitter.com/UUc0S5iceC