LOADING...
పాక్ పైనే నా చివరి మ్యాచ్.. రిటైర్మెంట్ పై డేవిడ్ వార్నర్ సంచలన వ్యాఖ్యలు 
ఆ దేశంతోనే చివరి ఆట : వార్నర్

పాక్ పైనే నా చివరి మ్యాచ్.. రిటైర్మెంట్ పై డేవిడ్ వార్నర్ సంచలన వ్యాఖ్యలు 

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Jun 03, 2023
06:19 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆస్ట్రేలియన్ స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ తన రిటైర్మెంట్ గురించి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆస్ట్రేలియా, పాకిస్థాన్ మధ్య 2024లో జరిగే సిరీస్ తనకు ఆఖరిది కావచ్చని హింట్ ఇచ్చాడు. 2024లో జరగనున్న టీ20 ప్రపంచకప్ వరకు ఆసీస్ తరఫున వైట్ బాల్ క్రికెట్ ఆడాలనుకుంటున్నానని వార్నర్ తెలిపారు. అయితే వచ్చే ఏడాది జనవరి తర్వాత టెస్టుల్లో ఆడబోనన్నాడు. 2024లో పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌లో సుదీర్ఘమైన ఫార్మాట్‌లో తన కెరీర్‌ను కొనసాగించాలని ఆశిస్తున్నట్లు చెప్పాడు. త్వరలోనే భారత్‌తో జరిగే ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ కోసం ఇంగ్లండ్‌ నెట్స్ లో వార్నల్ శ్రమిస్తున్నాడు. ఆ తర్వాత ఇంగ్లీష్ జట్టుతో 5 మ్యాచ్‌ల యాషెస్ సిరీస్‌లో పాల్గొనే అవకాశం ఉందన్నాడు.

DAVID WARNER RETIREMENT 

వైట్ బాల్ క్రికెట్ పై మాత్రమే దృష్టి: వార్నర్

డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ముందు స్థానిక విలేకరులతో మాట్లాడాడు వార్నర్. జనవరిలో పాకిస్తాన్‌తో జరిగే మ్యాచ్ లతో తన టెస్ట్ కెరీర్‌ను ముగించాలనుకుంటున్నట్లు వార్నర్ వివరించాడు. ఓ వైపు 2024లో వెస్టిండీస్,అమెరికాలో జరిగే టీ20 ప్రపంచ కప్ వరకు ఆడతానన్నవార్నర్, మరోవైపు కేవలం వైట్ బాల్ క్రికెట్‌పై మాత్రమే దృష్టి సారిస్తానన్నాడు. ఈ ఏడాది భారత్‌లో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సిరీస్‌లో వార్నర్ మూడు ఇన్నింగ్స్‌ల్లో కేవలం 26 పరుగులు మాత్రమే చేసి గాయాల కారణంగా స్వదేశానికి చేరుకున్నాడు. అతను ఇంగ్లండ్‌లో టెస్ట్‌లలో సగటు 26.04 మాత్రమే, మరియు 2019లో చివరి యాషెస్ పర్యటనలో 9.50 సగటుతో భయంకరమైన సమయాన్ని కలిగి ఉన్నాడు, అనుభవజ్ఞుడైన పేసర్ స్టువర్ట్ బ్రాడ్ ఏడుసార్లు అతని వికెట్ తీశాడు.