Page Loader
IPL 2025: సీఎస్‍కే డెన్‍లోకి పుష్ప స్టైల్‍లో రవీంద్ర జడేజా ఎంట్రీ.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో 

IPL 2025: సీఎస్‍కే డెన్‍లోకి పుష్ప స్టైల్‍లో రవీంద్ర జడేజా ఎంట్రీ.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో 

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 11, 2025
11:30 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకు తెలుగు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన "పుష్ప" సినిమా అంటే బాగా ఇష్టం.' గతంలోనూ గ్రౌండ్‌లో "తగ్గేదేలే" అంటూ పుష్ప స్టైల్ గెస్ట్‌చర్ చేసిన జడేజా, సోషల్ మీడియాలోనూ అల్లు అర్జున్‌లా కనిపించేలా ఓ ఫోటో షేర్ చేశాడు. "పుష్ప 2" సీక్వెల్ గతేడాది విడుదల కాగా, ఇప్పుడు మరోసారి ఆదే స్టైల్లో అభిమానులను అలరించాడు. ప్రస్తుతం ఐపీఎల్ 2025 సీజన్‌ కోసం చెన్నై సూపర్ కింగ్స్ (CSK) క్యాంప్‌లో చేరిన జడేజా, పుష్ప స్పూర్తితో స్టైల్‌గా ఎంట్రీ ఇచ్చాడు. ఈ వీడియోను CSK అధికారికంగా సోషల్ మీడియాలో పంచుకుంది.

వివరాలు 

పుష్ప మాస్ ఎంట్రీ 

ఇటీవలే ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో విన్నింగ్ షాట్ కొట్టిన జడేజా, భారత జట్టుకు టైటిల్ అందించాడు. దుబాయ్ నుంచి తిరిగి వచ్చి,వెంటనే ఐపీఎల్ 2025 కోసం CSK క్యాంప్‌లో చేరాడు. "పుష్ప 2" సినిమాలో అల్లు అర్జున్ కారు నుంచి దిగిన విధంగానే జడేజా కూడా కారులోంచి కాలు బయటపెట్టాడు. కారు అద్దంలో తన ప్రతిబింబం కనిపించేలా స్లో మోషన్‌లో స్టెప్ తీసాడు.అతని వాక్‌స్టైల్ మొత్తం పుష్ప స్టైల్‌ను పోలి ఉంది. "తగ్గేదేలే" గెస్ట్‌చర్ చేస్తూ,చేతిని వీపుపై ఊపుతూ,"జడ్డూ అంటే పేరు మాత్రమే కాదు, బ్రాండ్" అంటూ పుష్ప స్టైల్‌లో డైలాగ్ చెప్పాడు. జడేజా జెర్సీ నంబర్ 8ని హైలైట్ చేస్తూ,"పుష్ప 2" ఫార్మాట్‌లో టైటిల్ ఇచ్చారు.

మీరు
33%
శాతం పూర్తి చేశారు

వివరాలు 

సోషల్ మీడియాలో ట్రెండింగ్ 

బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా "పుష్ప" మూవీదే. ఇలా సీఎస్‍కే క్యాంప్‍లో పుష్ప స్వాగ్‍తో జడేజా అడుగుపెట్టాడు. చెన్నై సూపర్ కింగ్స్ జడేజా మాస్ ఎంట్రీ వీడియోను అధికారికంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. "మీ స్క్రీన్‌లపై వైల్డ్ ఫైర్ వస్తోంది" అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియో అద్భుతమైన స్పందనతో వైరల్ అవుతోంది. "పుష్ప స్వాగ్"ను జడేజా అద్భుతంగా రీప్రొడ్యూస్ చేశాడని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. "పుష్ప క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదని" అల్లు అర్జున్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

మీరు
66%
శాతం పూర్తి చేశారు

వివరాలు 

ఐపీఎల్ 2025 షెడ్యూల్ 

ఐపీఎల్ 2025 సీజన్ మార్చి 22 నుంచి మే 25 వరకు జరగనుంది. మార్చి 23న చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ముంబై ఇండియన్స్ తో తొలి మ్యాచ్ ఆడనుంది. జడేజా రూమర్లపై క్లారిటీ ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన తర్వాత, "జడేజా వన్డే క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించబోతున్నాడ" అనే పుకార్లు గట్టిగా వినిపించాయి. అయితే, ఆ వార్తలను తాను ఖండిస్తూ, "అవసరంలేని రూమర్లు వద్ద" అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. తన వన్డే కెరీర్ కొనసాగుతుందని స్పష్టం చేశాడు. అలాగే, కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కూడా వన్డేల నుంచి రిటైరవ్వడం లేదని క్లారిటీ ఇచ్చారు.

మీరు పూర్తి చేశారు