Page Loader
ప్రియురాలిని పెళ్లి చేసుకున్న టీమిండియా ఆల్ రౌండర్ అక్షర్ పటేల్
వివాహ బంధంతో ఒక్కటైన అక్షర్-మేహా

ప్రియురాలిని పెళ్లి చేసుకున్న టీమిండియా ఆల్ రౌండర్ అక్షర్ పటేల్

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 27, 2023
02:49 pm

ఈ వార్తాకథనం ఏంటి

టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ ఓ ఇంటివాడయ్యాడు. తన ప్రియురాలైన మేహా పటేల్‌ను అక్షర్ గురువారం పెళ్లి చేసుకున్నాడు. బంధుమిత్రులు, శ్రేయోభిలాషుల మధ్య వడోదరలో వైభవంగా జరిగింది. పెళ్లికి పలువురు క్రికెటర్లు, ప్రముఖులు హజరయ్యారు. ప్రస్తుతం అక్షర్ పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చిన్ననాటి స్నేహితురాలైన మెహాపటేల్‌తో కొన్నేళ్లుగా అక్షర్ ప్రేమలో ఉన్నాడు. గతేడాది తన పుట్టిన రోజున మెహా వేలికి ఉంగరం తొడిగి.. అక్షర్ నిశ్చితార్థం చేసుకున్న విషయం తెలిసిందే. ఎంగేజ్‌మెంట్ జరిగిన సంవత్సరం తర్వాత మెహాను వివాహం చేసుకున్నాడు. మెహా న్యూట్రిషనిస్ట్, డైటీషియన్ గా పనిచేస్తోంది. తన పెళ్లి కోసమే అక్షర్ పటేల్‌ న్యూజిలాండ్‌తో జరిగే వన్డే, టీ20 సిరీస్ నుంచి రెస్ట్ తీసుకున్నాడు.

అక్షర్ పటేల్

మహరాష్ట్రలో పెళ్లి చేసుకున్న రాహుల్-అతిమా

2014లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన అక్షర్ పటేల్, గత ఏడాదిన్నర కాలంగా మూడు ఫార్మాట్లలో టీమ్ ఇండియా తరఫున ఆడాడు. శ్రీలంక ఇటీవల 31 బంతుల్లో 65 పరుగులు చేసి సత్తా చాటిన విషయం తెలిసిందే. టీమిండియా స్టార్ క్రికెటర్ రాహుల్ కూడా ఈ మధ్యనే వివాహం చేసుకున్నాడు. జనవరి 23న బాలీవుడ్ నటి అతియా శెట్టిని రాహుల్ పెళ్లాడాడు. రాహుల్-అతియా మహారాష్ట్రలోని ఖండాలాలో అతికొద్ది మంది బంధు మిత్రుల సమక్షంలో ఒక్కటైన విషయం తెలిసిందే.