
Asia Cup 2023: 19వ వన్డే సెంచరీతో మెరిసిన పాక్ కెప్టెన్ బాబర్ ఆజం
ఈ వార్తాకథనం ఏంటి
ఆసియా కప్ 2023లో భాగంగా పాకిస్థాన్ ముల్తాన్ వేదికగా నేపాల్‌తో బుధవారం జరిగిన టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ 109 బంతుల్లో 10 బౌండరీల సాయంతో కెరీర్‌లో 19వ శతకాన్ని నమోదు చేశాడు.
ఈ సెంచరీతో వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో 15వ స్థానంలోకి ఎగబాకాడు.ఈ క్రమంలో డేవిడ్ వార్నర్ రికార్డును(19) సమం చేశాడు. సయీద్ అన్వర్(20)తర్వాత పాక్ తరఫున అత్యంత వేగంగా 19 సెంచరీలు చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.కేవలం 102 ఇన్నింగ్స్‌లలో బాబర్ 19 సెంచరీలు సాధించాడు. బాబర్‌కు ముందు ఈ రికార్డు సౌతాఫ్రికా హషీమ్ ఆమ్లా (104) పేరిట ఉండేది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
అద్భుతమైన సెంచరీ చేసిన పాక్ కెప్టెన్
A superb ton from the skipper 💯
— ICC (@ICC) August 30, 2023
Babar Azam now has as many international hundreds as Pakistan legends Javed Miandad and Saeed Anwar 👏#PAKvNEP | 📝: https://t.co/5ewtl5FKT7 pic.twitter.com/t74KKxJkye