Babar Azam: టీ20ల్లో క్రిస్ గేల్ రికార్డును బద్దలు కొట్టిన బాబర్ అజామ్
పాకిస్థాన్ మాజీ కెప్టెన్ బాబార్ అజామ్ కొత్త రికార్డు సృష్టించాడు. టీ20 క్రికెట్లో అత్యంత వేగంగా 11వేల పరుగుల మార్కును చేరుకున్న ఆటగాడిగా బాబర్ అజామ్ నిలిచింది. ఈ ఘనత సాధించిన ఆటగాళ్ల జాబితాలో 11వ ప్రధాన బ్యాటర్‌గా నిలిచాడు. ఇప్పటివరకు ఈ రికార్డు క్రిస్ గేల్ పేరిట ఉండేది. ఈ రికార్డు సాధించడానికి బాబర్ అజామ్ 309 మ్యాచుల్లో 298 ఇన్నింగ్స్‌లలో 11 సెంచరీలు, 90 హాఫ్ సెంచరీలు చేశాడు. ఇక 11,020 పరుగుల వద్ద ఈ మార్క్‌ను చేరుకున్న బాబర్, క్రిస్ గేల్‌తో పోలిస్తే తక్కువ ఇన్నింగ్స్‌లలోనే ఈ రికార్డును సాధించాడు. గేల్ 314 ఇన్నింగ్స్‌లలో ఈ మార్క్‌ను సాధించాడు.
11,000 పరుగులు సాధించిన బ్యాటర్లు వీరే
ప్రస్తుతం పాకిస్థాన్ దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌లో తలపడుతున్న సంగతి తెలిసిందే. ఈ సిరీస్‌లో రెండో టీ20 మ్యాచ్‌లో బాబర్ అజామ్ 20 బంతుల్లో 31 పరుగులు చేశాడు. 1)క్రిస్ గేల్ - 14,562 2). షోయబ్ మాలిక్ - 13,415 3). కీరన్ పొలార్డ్ - 13,335 4). హేల్స్ - 12,987 5). విరాట్ కోహ్లీ - 12,886 6). డేవిడ్ వార్నర్ - 12,411 7). జోస్ బట్లర్ - 11,967 8). రోహిత్ శర్మ - 11,830 9). ఆరోన్ ఫించ్ - 11,458 10). విన్స్ - 11,158
దక్షిణాఫ్రికా చేతిలో పాక్ ఓటమి
పాకిస్థాన్ - దక్షిణాఫ్రికా మధ్య జరిగిన రెండో టీ20లో పాక్ మరో పరాజయాన్ని ఎదుర్కొంది. మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 206/5 స్కోరు చేసింది. సైమ్ అయూబ్ (98*) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడగా, బాబర్ అజామ్ (31) కూడా మంచి ప్రదర్శన కనబర్చాడు. అయితే లక్ష్య ఛేదనలో రీజా రెడ్రిక్స్ (117) సెంచరీతో దక్షిణాఫ్రికా విజయం సాధించింది. 19.3 ఓవర్లలో 210 పరుగులు చేసి 3 వికెట్లతో దక్షిణాఫ్రికా సిరీస్‌లో 2-0 ఆధిక్యం పొందింది.