Page Loader
Babar Azam: కెప్టెన్సీ బాధ్యతల నుండి తప్పుకున్న బాబర్ ఆజమ్
కెప్టెన్సీ బాధ్యతల నుండి తప్పుకున్న బాబర్ ఆజమ్

Babar Azam: కెప్టెన్సీ బాధ్యతల నుండి తప్పుకున్న బాబర్ ఆజమ్

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 02, 2024
12:39 pm

ఈ వార్తాకథనం ఏంటి

పాకిస్థాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ బాబార్ అజామ్ పరిమిత ఓవర్ల క్రికెట్‌లో కెప్టెన్సీ బాధ్యతల నుండి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. కెప్టెన్సీ బాధ్యతల నుండి అతను తప్పుకోవడం ఇది రెండోసారి. ఈ సందర్భంగా ఆయన ఎక్స్ అకౌంట్‌లో ఒక స్టేట్‌మెంట్ విడుదల చేశారు. పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు తన ఆలోచనల గురించి గతంలోనే తెలియజేసినట్టు పేర్కొన్నాడు. కెప్టెన్సీ ఒత్తిడి నుండి విముక్తి పొందడం, బ్యాటింగ్ మీద ఫోకస్ పెట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశాడు. ఈ నిర్ణయం పీసీబీకి గత నెలలోనే తెలియజేశాయని వెల్లడించాడు.

Details

కెప్టెన్సీ రేసులో ముసర్రఫ్ రిజ్వాన్

2023లో వన్డే వరల్డ్ కప్‌లో మూడో స్థానంలో నిలవడంతో ఆ తరువాత బాబర్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. 2019లో టీ20 కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన బాబర్, 2020లో టెస్టు, వన్డే జట్లకు కూడా నాయకత్వం వహించాడు. ప్రస్తుతం, వికెట్ కీపర్ బాట్స్‌మన్ ముసర్రఫ్ రిజ్వాన్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టే అవకాశాలున్నాయి. అక్టోబర్ 7 నుంచి పాకిస్థాన్ ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌ను ఆడనుంది. తర్వాత ఆస్ట్రేలియా టూర్‌లో మూడు వన్డేలు, మూడు టీ20లు జరగనున్నాయి. ఇక డిసెంబరులో దక్షిణాఫ్రికాతో టెస్టులు, వన్డేలు, టీ20లు ఆడనుంది.