
ఇండియన్ క్రికెట్ అభిమానులకు చేదు వార్త
ఈ వార్తాకథనం ఏంటి
దేశవాలీ టోర్నీ దులీప్ ట్రోఫీ-2023 మ్యాచులు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. అయితే భారత క్రికెట్ అభిమానులకు బ్యాడ్ న్యూస్ అందింది.
స్వదేశంలో జరిగే మ్యాచుల కోసం బీసీసీఐకి ప్రసార భాగస్వామి లేనందున ఈ మ్యాచులకు ప్రత్యక్ష ప్రసారం కావడం లేదు.
బీసీసీఐ లోకల్ బ్రాడ్ కాస్టింగ్ రైట్స్ దక్కించుకునేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో భారత క్రికెట్ అభిమానులు దులీప్ ట్రోఫీ మ్యాచులను ప్రత్యక్షంగా చూసే అవకాశం ఉండదు.
దులీప్ ట్రోఫీలో స్టార్ ఆటగాళ్లు ఆడుతుండటంతో ఈ టోర్నీపై అభిమానులకు ఆసక్తి పెరిగింది. అయితే ఈ మ్యాచులను ప్రత్యక్షంగా తిలకించే సౌకర్యం లేనందున అభిమానులు నిరాశ చెందారు.
Details
వెస్ట్ జోన్ నుంచి బరిలోకి దిగనున్న సూర్యకుమార్ యాదవ్, ఛతేశ్వర్ పుజారా
దులీప్ ట్రోఫీలో వెస్ట్ జోన్ నుంచి సూర్యకుమార్ యాదవ్, ఛతేశ్వర్ పుజారా లాంటి అంతర్జాతీయ స్టార్ ప్లేయర్లు ఆడనున్నారు.
ఇక సెంట్రల్ జోన్ తరుపున రింకూసింగ్, సౌత్ జోన్ నుంచి తిలక్ వర్మ, సాయి సుదర్శన్ లాంటి ఐపీఎల్ స్టార్లు ఆడుతుండటంతో ఈ మ్యాచులపై అభిమానులు ఆసక్తి కనబరుస్తున్నారు.
దులీప్ ట్రోఫీలో అద్భుతంగా రాణిస్తున్న సర్పరాజ్ ఖాన్ వెస్ట్ జోన్ తరుపున బరిలోకి దిగుతున్నాడు.
నేటి దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్-ఈస్ట్ జోన్, నార్త్ జోన్-నార్త్ ఈస్ట్ జోన్ మధ్య మ్యాచులు ప్రారంభమయ్యాయి. మొదటి మ్యాచ్ కర్నాటకలోని కెఎస్‌సిఏ క్రికెట్ గ్రౌండ్‌లో, రెండో మ్యాచ్ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరగనుంది.