Loading...
Pat Cummins: బాల్ ట్యాంపరింగ్ వివాదం.. ఖవాజా ఆరోపణలపై కమిన్స్ సంచలన వ్యాఖ్యలు!
బాల్ ట్యాంపరింగ్ వివాదం.. ఖవాజా ఆరోపణలపై కమిన్స్ సంచలన వ్యాఖ్యలు!

Pat Cummins: బాల్ ట్యాంపరింగ్ వివాదం.. ఖవాజా ఆరోపణలపై కమిన్స్ సంచలన వ్యాఖ్యలు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 13, 2026
09:13 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆస్ట్రేలియా క్రికెట్‌లో 2018లో చోటుచేసుకున్న బాల్ ట్యాంపరింగ్ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. దక్షిణాఫ్రికా పర్యటనలో కేప్‌టౌన్ వేదికగా జరిగిన బాల్ ట్యాంపరింగ్ ఘటనపై మాజీ సహచరుడు ఉస్మాన్ ఖవాజా చేసిన ఆరోపణలను ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తీవ్రంగా ఖండించాడు. ఆ మ్యాచ్‌లో ఆడిన ఆస్ట్రేలియా జట్టులోని ఆటగాళ్లందరికీ శాండ్‌పేపర్‌తో బంతిని ట్యాంపరింగ్ చేసే విషయం తెలుసని ఖవాజా తన కొత్త పుస్తకంలో పేర్కొన్నాడు. అయితే ఈ ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదని కమిన్స్ స్పష్టం చేశాడు.

వివరాలు

ఖవాజా ఆరోపణలు 100 శాతం తప్పు: కమిన్స్

సిడ్నీలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన కమిన్స్.. ఖవాజా చేసిన వ్యాఖ్యలను '100 శాతం తప్పు', 'పూర్తిగా అర్థం లేని ఆరోపణలు'గా అభివర్ణించాడు.

బాల్ ట్యాంపరింగ్ కోసం శాండ్‌పేపర్ ఉపయోగించాలనే ప్రణాళిక వెనుక తాను, మరికొందరు ఆటగాళ్లు ఉన్నారనే ఖవాజా వాదనను తీవ్రంగా తిరస్కరించాడు.

శాండ్‌పేపర్ ఉపయోగించే విషయంలో జాగ్రత్తగా ఉండాలని కామెరూన్ బాన్‌క్రాఫ్ట్‌కు ఖవాజా చెప్పినట్లు తెలుసుకుని ఆశ్చర్యపోయానని కమిన్స్ వెల్లడించాడు.

'నాకు తెలిసిన ఉస్మాన్ అలాంటి వ్యక్తి కాదు' అంటూ తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు.

వివరాలు

ఖవాజా పుస్తకంపై కమిన్స్ అసంతృప్తి

తన పుస్తకంలో ఖవాజా అనేకమంది జీవితాల గురించి నిర్లక్ష్యంగా రాశాడని కమిన్స్ అభిప్రాయపడ్డాడు.

'తన పుస్తకంలో ఉస్సీ నా జీవితంతో పాటు ఎంతోమంది జీవితాల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించాడని వ్యాఖ్యానించాడు.

ఖవాజా తన కథను చెప్పుకునే హక్కును తాను గౌరవిస్తానని, అయితే చెప్పే మాటలకు, చేసే పనులకు బాధ్యత వహించడం కూడా ముఖ్యమని పేర్కొన్నాడు.

ADVERTISEMENT

వివరాలు

అప్పట్లో జట్టులో గెలుపే లక్ష్యంగా వ్యవహరించేవాళ్లం

2018లో ఆస్ట్రేలియా జట్టులో గెలుపు కోసం ఎంతకైనా తెగించే మనస్తత్వం ఉండేదని కమిన్స్ అంగీకరించాడు. జట్టు అంతర్గతంగా కొన్ని ప్రతికూల పరిస్థితులు, విభేదాలు ఉండేవని, ఆటగాళ్ల మధ్య అనేక గ్రూపులు ఉండేవని తెలిపాడు.

అయితే అలాంటి పరిస్థితులు ఇప్పుడు పూర్తిగా తొలగిపోయాయని పేర్కొన్నాడు.

అదే సమయంలో బంతిని రివర్స్ స్వింగ్ చేయించేందుకు అక్రమ పద్ధతులు ఉపయోగించాలనే ఉద్దేశంతో జట్టు మొత్తం కలిసి ఎలాంటి ప్రణాళిక రూపొందించలేదని స్పష్టం చేశాడు.

ఈ అంశంపై జట్టు సమావేశం కూడా జరగలేదని ఖవాజా ఆరోపణలను ఖండించాడు.

ADVERTISEMENT

వివరాలు

తన కెరీర్‌లో ఒక్కసారే బాల్ ట్యాంపరింగ్ చూశా

తన ప్రొఫెషనల్ క్రికెట్ కెరీర్‌లో ప్రత్యక్షంగా బాల్ ట్యాంపరింగ్‌ను చూసింది ఒక్కసారేనని కమిన్స్ వెల్లడించాడు.

తన కెరీర్ ప్రారంభంలో న్యూ సౌత్ వేల్స్ జట్టుకు చెందిన ఓ సహచర ఆటగాడు షెఫీల్డ్ షీల్డ్ మ్యాచ్‌లో బాటిల్ క్యాప్‌తో బంతిని గీసిన ఘటనను గుర్తుచేసుకున్నాడు.

'అతను బ్యాటర్. సీనియర్ ఆటగాడు కావడంతో అతని పేరు చెప్పను. కానీ మైదానంలో బాటిల్ క్యాప్ బయటకు తీశాడు' అని వివరించాడు.

ఈ ఘటనను గుర్తించిన అంపైర్లు వెంటనే జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించారని తెలిపాడు.

వివరాలు

జట్టు మొత్తం బాధ్యత తీసుకోవాలన్న చర్చ గుర్తులేదు

కేప్‌టౌన్ బాల్ ట్యాంపరింగ్ ఘటనకు సంబంధించి జట్టు మొత్తం బాధ్యత తీసుకోవాలని చర్చ జరిగినట్లు తనకు గుర్తులేదని కమిన్స్ స్పష్టం చేశాడు.

ఆటగాళ్లంతా కలిసికట్టుగా ఈ ఘటనకు బాధ్యత వహించాలని ఎవరైనా ప్రతిపాదించినట్లు కూడా తనకు గుర్తులేదన్నాడు.

అలాంటి ప్రతిపాదన చేసిన ఇద్దరు వ్యక్తులు ఎవరనేది కూడా తనకు తెలియదని పేర్కొన్నాడు.

అయితే ఈ ఘటనపై తాను జట్టు మొత్తం బాధ్యత తీసుకోవాలని సూచించానని ఖవాజా తన పుస్తకంలో పేర్కొన్నాడు.

దీంతో ఇద్దరు మాజీ సహచరుల మధ్య ఈ వ్యవహారం మరోసారి వివాదానికి దారితీసింది.

ADVERTISEMENT