Page Loader
BanVsNz: రేపే ఆఖరి టెస్ట్, బంగ్లాదేశ్‌ చరిత్ర సృష్టిస్తుందా..న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌ గెలిచేనా
బంగ్లాదేశ్‌ చరిత్ర సృష్టిస్తుందా..న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌ గెలిచేనా

BanVsNz: రేపే ఆఖరి టెస్ట్, బంగ్లాదేశ్‌ చరిత్ర సృష్టిస్తుందా..న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌ గెలిచేనా

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Dec 05, 2023
06:36 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచ టెస్టు క్రికెట్‌లో బంగ్లాదేశ్ జట్టు సంచలన విజయం నమోదు చేసింది. అంతర్జాతీయ క్రికెట్‌లో బలమైన న్యూజిలాండ్‌ను బంగ్లా పులులు చిత్తు చేశారు. ఈ మేరకు సొంత గడ్డపై జరిగిన తొలి టెస్ట్‌ మ్యాచులో 150 పరుగుల బారీ తేడాతో ఓడించి ఔరా అనిపించింది. ఫలితంగా 2 మ్యాచుల టెస్టు సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఈ ప్రదర్శనతో ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది. ఇదే సమయంలో బంగ్లాదేశ్ గడ్డపై కివీస్‌ను ఓడించిన ఆ జట్టుకు ఇదే తొలిసారి. కాగా గతేడాది న్యూజిలాండ్‌ పర్యటనలోనూ బంగ్లాదేశ్ జట్టు కివీస్‌కు టెస్టుల్లో ఓటమిని చూపించింది.

DETAILS

బంగ్లా గెలిస్తే సరికొత్త రికార్డు 

మరోవైపు డిసెంబర్ 6 నుంచి ఢాకాలో ప్రారంభమయ్యే 2వ, చివరి టెస్ట్‌లో బంగ్లా గెలిస్తే మరో కొత్త చరిత్ర సృష్టించినట్టు అవుకుంది.ఈ క్రమంలోనే టెస్ట్ సిరీస్ గెలిచి సరికొత్త హిస్టరీ నమోదు చేసే అవకాశం ఉంది. హెడ్ టుహెడ్ రికార్డ్ : NZ 13-2 BAN బంగ్లా, కివీస్ జట్లు 18 టెస్టుల్లో తలపడ్డాయి.దీంట్లో 13 మ్యాచ్‌ల్లో కివీస్ విజయం సాధించింది.అయితే బంగ్లా మాత్రం కేవలం రెండు టెస్టులు మాత్రమే గెలవగలిగింది.రెండు జట్ల మధ్య మూడు మ్యాచులు డ్రాలు అయ్యాయి. తమ చివరి సిరీస్‌ను 2022లో డ్రా చేసుకున్నారు.బంగ్లాదేశ్ గతేడాది మౌంట్ మౌంగానుయ్‌లో న్యూజిలాండ్‌పై తొలి టెస్టు విజయాన్ని నమోదు చేసింది.ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం రెండో మ్యాచ్ గెలిస్తే సరికొత్త చరిత్ర లిఖించినట్టు అవుతుంది.