Bangladesh: భారత్‌తో టెస్టు సిరీస్..జట్టును ప్రకటించిన బంగ్లాదేశ్
బంగ్లాదేశ్ (Bangladesh) భారతదేశంతో జరిగే రెండు టెస్టుల సిరీస్‌కు తన జట్టును ప్రకటించింది. గాయపడిన షోరిఫుల్ ఇస్లామ్ స్థానంలో వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్ జకీర్ అలీని జట్టులోకి ఎంపిక చేశారు. లెఫ్ట్ ఆర్మ్ బౌలర్ షోరిఫుల్ రెండు మ్యాచ్‌లకు దూరంగా ఉండనున్నాడు. గత నెలలో పాకిస్థాన్‌తో జరిగిన తొలి టెస్టు సమయంలో గజ్జల నొప్పితో బాధపడుతూ, ఆయన ఆడలేకపోయారు. పాకిస్థాన్ టూర్‌కు వెళ్లిన 16 మందిలో షోరిఫుల్ మాత్రమే జట్టుకు దూరంగా ఉన్నాడు. ఆ సిరీస్‌లో బంగ్లాదేశ్ 2-0 తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. శోరిఫుల్ ఇప్పటి వరకు బంగ్లాదేశ్ తరఫున 17 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు ఆడాడు.ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 49 మ్యాచ్‌ల్లో 41.47 సగటుతో 2862 పరుగులు చేశాడు.
ఈ రెండు టెస్టులు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో భాగం
ఇందులో నాలుగు సెంచరీలు, 19 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. సెప్టెంబర్ 19 నుంచి చెన్నైలో బంగ్లాదేశ్-భారత్ టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. రెండో టెస్టు సెప్టెంబర్ 27 నుంచి కాన్పూర్‌లో జరగనుంది. ఈ రెండు టెస్టులు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో భాగం. ప్రస్తుతానికి ఇండియా, ఆస్ట్రేలియా జట్లు ర్యాంకింగ్స్‌లో టాప్‌లో ఉన్నాయి, బంగ్లాదేశ్ నాల్గవ స్థానంలో ఉంది. బంగ్లా జట్టు జన్ముల్ హుస్సేన్ షాంతో, షాద్మాన్ ఇస్లాం, జకీర్ హసన్, మొమినుల్ హక్, ముష్‌ఫికర్ రహిమ్(వికెట్ కీపర్), షకీబ్ అల్ హసన్, లింటన్ దాస్, మెహిదీ హసన్ మీర్జా, జకీర్ అలీ, తస్కిన్ అహ్మద్, హసన్ మహమూద్, నహిద్ రాణా, తైజుల్ ఇస్లామ్,మహమదుల్ హసన్ జాయ్, నయిమ్ హసన్, ఖలీద్ అహ్మద్.