Page Loader
Nahid Rana: భారత్‌తో సిరీస్‌కు సిద్ధం.. బంగ్లాదేశ్‌ యువ పేసర్‌ నహిద్ రాణా 
భారత్‌తో సిరీస్‌కు సిద్ధం.. బంగ్లాదేశ్‌ యువ పేసర్‌ నహిద్ రాణా

Nahid Rana: భారత్‌తో సిరీస్‌కు సిద్ధం.. బంగ్లాదేశ్‌ యువ పేసర్‌ నహిద్ రాణా 

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 11, 2024
12:33 pm

ఈ వార్తాకథనం ఏంటి

సెప్టెంబరు 19 నుంచి భారత్, బంగ్లాదేశ్‌ జట్ల మధ్య రెండు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో బంగ్లా యువ పేసర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత‌తో టెస్టు సిరీస్‌ ఆడేందుకు సిద్ధంగా ఉన్నామని ఆ జట్టు యువ పేసర్‌ నహిద్‌ రాణా స్పష్టం చేశాడు. భారత్‌ బలమైన జట్టే అయినప్పటికీ, మెరుగ్గా ఆడిన జట్టు గెలుస్తుందని, అది తాము భారత్‌కు వెళ్లాక చూస్తామని నహిద్ ధీమాను వ్యక్తం చేశాడు. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు విడుదల చేసిన వీడియోలో 'ఎక్స్' ప్లాట్‌ఫారమ్‌లో ఈ వ్యాఖ్యలు అయ్యాయి.

Details

శ్రీలంకతో జరిగిన టెస్టుల్లో అరంగేట్రం చేసిన నహిద్ రాణా

ఈ ఏడాది మార్చిలో శ్రీలంకపై టెస్టుల్లో అరంగేట్రం చేసిన నహిద్‌ రాణా తన వేగంతో అందరి దృష్టిని ఆకర్షించాడు. 150 కిమీ వేగంతో బంతులు సంధిస్తూ, ప్రత్యర్థి బ్యాటర్లకు చుక్కలు చూపాడు. ఇటీవల పాకిస్థాన్‌తో సిరీస్‌లో 2-0 విజయంలో కీలక పాత్ర పోషించాడు. రావల్పిండిలో జరిగిన టెస్టులో 44 పరుగులిచ్చి నాలుగు కీలక వికెట్లు పడగొట్టాడు.